Site icon NTV Telugu

HanuMan OTT: ‘హనుమాన్ ‘ ఓటీటీ రిలీజ్ అప్డేట్.. ప్రశాంత్ వర్మ ఏంటయ్యా ఇది..

Hanuman (4)

Hanuman (4)

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బాస్టర్ హిట్ అయిన సినిమాల్లో హనుమాన్ ఒకటి.. సినిమా విడుదలై రెండు నెలలు పూర్తి అయిన కూడా ఆ సినిమా క్రేజ్ తగ్గలేదు.. అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ గురించి ఎప్పుడో అప్డేట్ వచ్చినా కూడా ఇంకా ఓటీటీలోకి రాలేదు..ఓటీటీ రైట్స్ సొంతం చేసుకున్న జీ5 తో పాటు మేకర్స్ కూడా ఇదిగో, అదిగో అంటున్నారు కానీ.. ఇంత వరకు రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించలేదు. ఓటీటీలో చూసేందుకు ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు..

తాజాగా జీ5 ఓటీటీ సంస్థ.. ‘హనుమాన్’ ఓటీటీ విడుదల పై చేసిన ట్వీట్ ప్రేక్షకులను మరింతగా డిజప్పాయింట్ చేస్తోంది. ఈ ట్వీట్‌లో ‘హనుమాన్’ తెలుగు వెర్షన్‌కు సంబంధించి అప్‌డేట్ ఇస్తున్నట్లే ఇచ్చి మళ్లీ నిరాశను మిగిల్చింది.. సినిమా హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. ఏయే ప్లాట్‌ఫామ్స్‌లో ఈ సినిమా విడుదల కాబోతుందో.. ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటుందో.. డేట్, టైమ్‌తో సహా ప్రకటించారు. కానీ తెలుగులో కూడా మరో అప్డేట్ రాలేదు..

తెలుగు వర్షన్ ఓటీటీ విడుదలపై డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మరో ట్వీట్ చేశారు.. హనుమాన్ ఓటీటీ విడుదల ఆలస్యం.. కావాలని చేస్తుంది కాదు. ఈ సినిమాను ఓటీటీలోకి తెచ్చేందుకు అడ్డుగా ఉన్న వాటినన్నింటినీ తొలగించేందుకు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నాము. ది బెస్ట్ ఇవ్వాలనేదే మా ఉద్దేశ్యం. దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పటి వరకు మాకు సపోర్ట్ చేస్తూ వస్తున్న వారందరికీ ధన్యవాదాలు.. అని ట్వీట్ లో పేర్కొన్నాడు.. దీనిపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి..

Exit mobile version