Site icon NTV Telugu

Hanuman: హనుమాన్ ఒక రోజు ముందే బరిలోకి.. టీం సంచలన నిర్ణయం

Hanuman

Hanuman

Hanuman movie paid premieres on 11th January: ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాల్లో హనుమాన్ కూడా ఒకటి. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో తేజ సజ్జ హీరోగా నటించాడు. అమృత అయ్యర్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక హనుమంతుడిని వానర రూపంలో హిందువులు దేవతలుగా భావించి పూజిస్తారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో మొదటి సినిమా అయిన మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ ‘హను-మాన్‌’లో వానరం ప్రత్యేక పాత్ర ఉంది. ‘హను-మాన్‌’లో వానరం పేరు కోటి, అది సినిమా అంతటా ఉంటుందని అంటున్నారు. ఈ కీలక పాత్రకు మాస్ మహారాజా రవితేజ తన వాయిస్ ని అందించారు. అఖండ భారత్‌లోని ఇతిహాసం నుండి ప్రేరణ పొందిన హను-మాన్ ఫస్ట్ ఇండియన్ సూపర్ హీరో సినిమా అని మేకర్స్ చెబుతున్నారు. అంజనాద్రి అనే ఫాంటసీ లోకం నేపథ్యంలో కథ సాగుతుంది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌కి అన్ని భాషల్లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

Guntur Kaaram: గుంటూరు కారం సెన్సార్ కూడా అయిపోయింది.. బాబు దిగుతున్నాడు!

ఇక సంక్రాంతి సినిమాల్లో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఒక పక్కన ఉండగా మరోపక్క గుంటూరు కారం కూడా రిలీజ్ చేస్తూ ఉండడంతో గట్టి పోటీ నెలకొంది. రెండూ జనవరి 12న రిలీజ్ అవుతూ ఉండగా ఇప్పుడు హనుమాన్ మేకర్స్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అదేమంటే జనవరి 11న హనుమాన్ సినిమా పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో అమృత అయ్యర్ కథానాయికగా, వినయ్ రాయ్ ప్రతినాయకుడిగా నటించగా, సముద్రఖని, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా అస్రిన్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్‌గా వెంకట్ కుమార్ జెట్టి, అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా కుశాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ త్రయం సంగీతం అందించారు. ఈ మాగ్నమ్ ఓపస్‌కి సినిమాటోగ్రఫీ శివేంద్ర. ప్రొడక్షన్ డిజైనర్ శ్రీనాగేంద్ర తంగాల. హను-మాన్ జనవరి 12న సంక్రాంతికి తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్‌తో సహా పలు భారతీయ భాషల్లో పాన్ వరల్డ్‌ విడుదల కానుంది.

Exit mobile version