Hanuman: తేజ సజ్జా, అమృత అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హనుమాన్. ఎన్నో అంచనాలతో నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనుకున్నట్లుగానే హనుమంతుడు మరోసారి మ్యాజిక్ చూపించాడు. ముఖ్యంగా ప్రశాంత్ వర్మ టేకింగ్, విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి. హనుమాన్ విజువల్స్, తేజ సజ్జా యాక్టింగ్ వేరే లెవెల్ అని చెప్పడం చాలా తక్కువగా అనిపిస్తుంది. ఇక హనుమాన్ హిట్ దిశగా కొనసాగుతుండడంతో.. ప్రతిఒక్కరు ఆదిపురుష్ ను గుర్తుచేసుకోవడం విశేషం. రూ. 600 కోట్ల బడ్జెట్ తో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఆదిపురుష్ ను తెరకెక్కించాడు. ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా.. తనదైన రీతిలో రామాయణాన్ని ప్రేక్షకులకు చూపించాడు. పాన్ ఇండియా సినిమా, హై బడ్జెట్ అన్నది ఒక ఎత్తు అయితే.. ప్రభాస్ రాముడిగా అనేసరికి ఈ సినిమాపై ప్రేక్షకులు ఆకాశంలో అంచలనాలను పెట్టుకొని థియేటర్ కు వెళ్లారు. కానీ, ఓం రౌత్ చూపించిన సినిమా మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. విజువల్స్ కానీ, కథనం, తీసిన విధానం ఏది నచ్చలేదు.
అసలు ఓం రౌత్ ను ప్రభాస్ ఎంత ట్రోల్ చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అదే సమయంలో హనుమాన్ టీజర్ రిలీజ్ అయ్యింది. అందులో ప్రశాంత్ వర్మ చూపించిన ఒకే ఒక్క షాట్.. హనుమంతుడు విగ్రహం.. నది ఒడ్డున నిలబడి ఉన్నట్లు చూపించాడు. ఇక అప్పటినుంచే హనుమాన్ పై అంచనాలు పెరిగాయి. ట్రైలర్, సాంగ్స్ ఇంకా హైప్ తెచ్చాయి. ఇక సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. కేవలం రూ. 20 నుంచి 25 కోట్ల బడ్జెట్ తో అద్భుతమైన విజువల్స్ ను కళ్ళముందు చూపించాడు. వందల కోట్లు ఖర్చుపెట్టి తీసిన ఆదిపురుష్ కంటే.. 25 కోట్లతో తీసిన హనుమాన్ అదిరిపోయిందని, ఒక అద్భుతమని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఇక థియేటర్ నుంచి బయటకు వచ్చిన ప్రతిఒక్కరు.. ఓం రౌత్ పై ఫైర్ అవుతున్నవారే.. ఇదిరా సినిమా అంటే.. ఇదిరా విఎఫ్ఎక్స్ అంటే.. చూసి నేర్చకో ఓం రౌత్ .. అంటూ కడిగిపడేస్తున్నారు. మరి హనుమాన్ ముందు ముందు రఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.