Hanuman: ఓవర్సీస్ లో 4 మిలియన్ డాలర్స్… ఓవరాల్ గా 200 కోట్లు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంక్రాంతి సినిమాల్లో హనుమాన్ దెబ్బ అదుర్స్ అనేలా ఉంది. మహేష్ బాబు గుంటూరు కారం సినిమాకు పోటీగా జనవరి 12న రిలీజ్ హినుమాన్ సినిమా… డే వన్ నుంచే క్లీన్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ప్రజెంట్ బ్లాక్ బస్టర్ వసూళ్లతో దూసుకుపోతోంది. తక్కువ థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమా… అదిరిపోయే ఆక్యుపెన్సీ మెంటైన్ చేస్తోంది. హనుమాన్ క్రేజ్‌కు తెలుగులో ఇంకా థియేటర్లు పెరుగుతునే ఉన్నాయి. అసలు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జా ఈ రేంజ్ హిట్ ఊహించి ఉండరు. అమలాపురం టు అమెరికా వరకు హనుమాన్ పై కాసుల వర్షం కురుస్తోంది. ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యే వరకు 150 కోట్ల గ్రాస్ రాబట్టిన హనుమాన్.. 200 కోట్ల దిశగా దూసుకుపోతోంది. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 170 కోట్లకు పైగా గ్రాస్ కొల్లగొట్టింది. మళ్లీ వీకెండ్ మొదలైంది కాబట్టి… మండే వరకు 200 కోట్ల క్లబ్‌లో చేరి సెన్సేషన్ క్రియేట్ చేయబోతోంది హనుమన్.
ఓవర్సీస్ లో కూడా హనుమాన్ సినిమా మాస్ ర్యాంపేజ్ కొనసాగిస్తూ ఉంది. స్టార్ హీరోల రికార్డులు కూడా బ్రేక్ చేస్తూ హనుమాన్ సినిమా ఇప్పటివరకు నార్త్ అమెరికాలో 4 మిలియన్ డాలర్స్ కి కలెక్ట్ చేసింది. ప్రభాస్, రాజమౌళిల పాన్ ఇండియా సినిమాల తర్వాత హనుమాన్ ఇప్పుడు టాప్ ప్లేస్ లో ఉంది. ఏ తెలుగు హీరో సూపర్ హిట్ సినిమా కూడా 4 మిలియన్ డాలర్స్ ని నార్త్ అమెరికాలో కలెక్ట్ చేయలేదు. 22న అయోధ్య రామ మందిరం కార్యక్రమం ఉంది కాబట్టి.. నార్త్ బెల్ట్‌లో వసూళ్లు మరింతగా పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పటికే నార్త్‌లో కెజియఫ్ చాప్టర్ వన్, కాంతార సినిమాల ఫస్ట్ వీక్ కలెక్షన్స్ రికార్డ్ బ్రేక్ చేసింది. ఓవర్సీస్‌లో టాప్ 5లోకి దూసుకొచ్చి ప్రభాస్, రాజమౌళి సినిమాల తర్వాతి ప్లేస్‌లో నిలిచింది. ఖచ్చితంగా హనుమాన్ సినిమా మేకర్స్ ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలను తెచ్చి పెట్టడం గ్యారెంటీ. మరి లాంగ్ రన్‌లో హనుమాన్ ఎంత రాబడుతుందో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఎల్ నినో ముప్పుపై అప్రమత్తంగా ఉండాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
-
Kawasaki Z300 India Launch: Kawasaki Z300 భారత్‌లోకి.. ధర ఎంత? 296cc ఇంజిన్, ఫీచర్లు, లాంచ్ డేట్ వివరాలు!
-
Nithiin: ‘అలియాస్ రుక్మిణి’తోనైనా నితిన్ లెక్క సరిచేస్తాడా?
-
Special Summary Revision: SIR వివాదం మధ్య ఈసీ కీలక నిర్ణయం.. 17 రాష్ట్రాల్లో ఓటరు జాబితాల సవరణకు ఆదేశాలు!
-
Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!