Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hanuman Ansh: భారతీయ చిత్రసీమలో కంటెంట్ ఉన్న ఆధ్యాత్మిక చిత్రాలకు తిరుగులేదని నిరూపించిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ‘హోంబలే ఫిల్మ్స్’ మరో సంచలనానికి తెరతీసింది. దేశవ్యాప్తంగా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుని సెన్సేషన్ సృష్టించిన డివైన్ బ్లాక్‌బస్టర్ ‘హనుమాన్ అంశ్’ను ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, భక్తులు ప్రేమగా ‘మహారాజ్-జీ’ అని కొలిచే ‘నీమ్ కరోలి బాబా’ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంపై దక్షిణాదిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘కేజీఎఫ్’, ‘కాంతార’ వంటి పాన్-ఇండియా హిట్స్ అందించిన హోంబలే ఫిల్మ్స్ కేవలం భారీ సినిమాలకే పరిమితం కాకుండా, విశిష్టమైన ఆధ్యాత్మిక కథలను వెలుగులోకి తేవడంలో ఎప్పుడూ ముందుంటుంది. గతంలో ఈ సినిమా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్‌ను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించిన హోంబలే సంస్థ, ఇప్పుడు ఏకంగా సౌత్ ఇండియన్ భాషల (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం) థియేట్రికల్ రైట్స్‌ను చేజిక్కించుకోవడం ట్రేడ్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.
హిందీలో ప్రేక్షకుల హృదయాలను కదిలించిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 9న తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు పూర్తి చేసింది. తాజాగా విడుదలైన ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్ సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది. నీమ్ కరోలి బాబా జీవితంలోని కీలక మలుపులు, ఆయన చేసిన అద్భుతాలు, ఆధ్యాత్మిక పరివర్తనను అత్యంత సహజంగా, భావోద్వేగభరితంగా ఇందులో ఆవిష్కరించారు. బాబా పాత్రలో శోబినావ్ సత్యా పరకాయ ప్రవేశం చేయగా.. చందన్ ఆనంద్, పూర్ణిమా తివారీ తమ పాత్రలతో ప్రాణం పోశారు. దర్శకుడు డాక్టర్ విశాల్ చతుర్వేది టేకింగ్, శ్రేయాస్ ధర్మాధికారి, రిషి పాఠక్ అందించిన దివ్యమైన సంగీతం ట్రైలర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. స్టీవ్ జాబ్స్, మార్క్ జుకర్‌బర్గ్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలను సైతం ప్రభావితం చేసిన నీమ్ కరోలి బాబా తత్వం.. భాషల సరిహద్దులు లేని విశ్వజనీనమైనది. అక్టోబర్ 9న థియేటర్లలోకి వస్తున్న ఈ చిత్రం తెలుగు బాక్సాఫీస్ వద్ద కూడా సరికొత్త సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Also Read
- Jailer 2 Telugu Trailer: 'జైలర్ 2' ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
- Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!