Site icon NTV Telugu

‘పుష్ప’రాజ్ ట్రాన్స్ లో హనుమ విహారి… ఇట్స్ మూవీ టైమ్ !

hanuma-vihari

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తాజా చిత్రం ‘పుష్ప: ది రైజ్’ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చి, మంచి విజయాన్ని అందుకుంది. అయితే చాలామంది ప్రేక్షకులతో పాటు సెలెబ్రిటీలు కూడా ఇంకా ‘పుష్ప’ ట్రాన్స్ లోనే ఉన్నారు. అందుకు నిదర్శనమే తాజాగా హనుమ విహారి చేసిన పోస్ట్. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ కోసం సౌత్ ఆఫ్రికాలో ఉన్న హనుమ విహారి తాజాగా ‘పుష్ప’ సినిమా చూస్తున్నాను అంటూ పోస్ట్ చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. ముందుగా ‘ఏ సినిమా చూస్తున్నానో గెస్ చేయండి?’ అంటూ సస్పెన్స్ లో ఉంచి, తరువాత పోస్ట్ లో ‘పుష్ప’రాజ్ ట్రాన్స్ లో ఉన్నాను అంటూ హనుమ విహారి ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఇప్పుడు విహారి ఇండియన్ క్రికెట్ టీమ్ తో కలిసి ఉన్నాడు కాబట్టి… అంతా టీమిండియా మొత్తం కలిసే ఈ సినిమా చూసినట్లుగా ప్రచారం జరుగుతోంది.

Read Also : షణ్ముఖ్ తో దీప్తి సునైనా బ్రేకప్… సుదీర్ఘ పోస్టుతో షాక్

ఎందుకంటే ‘పుష్ప’ సినిమా అధికారిక సోషల్ మీడియా ఖాతా నుంచి హనుమ విహారి పోస్టుకు స్పందిస్తూ ‘పుష్ప’ హిందీ అంటూ క్లారిటీ ఇచ్చింది. దీంతో ‘పుష్ప’ యూనిట్ సహకారంతో ఇండియన్ క్రికెట్ టీం ‘పుష్ప’ సినిమాను చూసింది అంటున్నారు నెటిజన్లు. విహారి అల్లు అర్జున్ తో పాటు చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు. అల్లు అర్జున్ కూడా విహారి పోస్టుకు స్పందిస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు.

Exit mobile version