Prasanth Varma: క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్నతొలి చిత్రం ‘హను-మాన్’. యువ కథానాయకుడు తేజ సజ్జా నటించిన ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఈ విషయాన్ని సోమవారం మేకర్స్ తెలియ చేస్తూ, అద్భుతమైన లొకేషన్‌ని చూపించే వీడియోని షేర్ చేశారు. ఈ సినిమా ప్రొడక్షన్ పనులు పూర్తి చేయడానికి 130 వర్కింగ్ డేస్ పట్టింది. ‘హను-మాన్’ భారతదేశం అంతటా చిత్రీకరించబడింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దర్శకుడు ప్రశాంత్ వర్మ తన చిత్రాలన్నింటి కంటే బెస్ట్ క్యాలిటీతో పాటు ప్రేక్షకుల అంచనాలను అందుకోవడం కోసం ఈ సినిమాకు ఎక్కువ సమయం కేటాయించారు.
ఇప్పటికే విడుదలైన మూవీ టీజర్‌కి యూట్యూబ్‌లో అన్ని భాషల్లో అద్భుతమైన స్పందన వచ్చింది. హనుమాన్ జయంతి నాడు విడుదలైన హనుమాన్ చాలీసా కూ దేశం నలుమూలల నుండి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడానికి టీమ్ అహర్నిశలు కష్టపడుతోంది. ఈ సినిమాను తెలుగు, హిందీ, మరాఠీ, తమిళ, కన్నడ, మలయాళ, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్ , జపనీస్‌తో సహా పాన్ వరల్డ్ గా విడుదల కానుంది. నిర్మాతలు త్వరలోనే ఖచ్చితమైన విడుదల తేదీని అనౌన్స్ చేశారు. అంజనాద్రి అనే ఊహాత్మక ప్రదేశంలో సెటప్ చేసిన ఈ కథలో హనుమంతుడు శక్తులు పొంది అంజనాద్రి కోసం ఎలా పోరాడాడు అనేది ఇందులో కథాంశం. తేజ సజ్జ సరసన అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తుండగా, వినయ్ రాయ్ విలన్‌గా, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. చైతన్య సమర్పణలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె. నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా అస్రిన్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్‌గా వెంకట్ కుమార్ జెట్టి, అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా కుశాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి శివేంద్ర సినిమాటోగ్రఫీ అందించగా.. గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ త్రయం సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీనాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్.
Andddddddd it's a Wrap! #HanuMan pic.twitter.com/n1Z2jDUEyj
— Teja Sajja (@tejasajja123) April 17, 2023