Hansika Motwani Gives Clarity On Her Cinema Career After Marriage: పెళ్లయిన తర్వాత చాలామంది నటీమణులు సినిమాలకు స్వస్తి పలికి.. తమ మ్యారేజ్ లైఫ్ మీదే ఫోకస్ పెడుతుంటారు. అత్తింటివారి సాంప్రదాయాలకు అనుగుణంగా తమని తాము మలచుకొని, భర్తతో హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేస్తుంటారు. కొందరు తిరిగి రీఎంట్రీ ఇస్తారు కానీ, మిగతా వాళ్లు మాత్రం మళ్లీ సినిమాల జోలికి వెళ్లరు. ఇప్పుడు హన్సిక పెళ్లి అవుతున్న నేపథ్యంలో.. ఆమె కూడా పెళ్లయ్యాక సినిమాలకి గుడ్‌బై చెప్తుందా? లేక కొంతకాలం బ్రేక్ తీసుకొని రీఎంట్రీ ఇస్తుందా? అనే చర్చలు జరుగుతున్నాయి. మునుపటిలాగా హన్సికకు పెద్దగా క్రేజ్ లేకపోవడం, ఆఫర్లు కూడా పెద్దగా రావడం లేదు కాబట్టి.. పెళ్లయ్యాక ఈ అమ్మడు చిత్రసీమకు గుడ్‌బై చెప్పొచ్చని అంతా అనుకుంటున్నారు.
కానీ.. హన్సిక మాత్రం పెళ్లయ్యాక కూడా సినిమాలు చేయాలని నిర్ణయించుకుంది. స్వయంగా హన్సికనే ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. పెళ్లి తర్వాత కూడా తాను తన సినిమా కెరీర్‌ని కంటిన్యూ చేస్తానని, హీరోయిన్‌గా కొనసాగుతానని స్పష్టం చేసింది. ఈ విషయంపై తాను ఆల్రెడీ తనకు కాబోయే భర్తతో చర్చించుకున్నానని, తన సినీ కెరీర్‌కి అతను అడ్డు చెప్పలేదని క్లారిటీ ఇచ్చింది. అంటే.. పెళ్లయ్యాక కూడా మనం హన్సికని హీరోయిన్‌గా చూడొచ్చన్నమాట! మరి, ఈ భామకు అప్పుడు అవకాశాలు వస్తాయో లేదో చూడాలి. కాగా.. హన్సిక తన ప్రియుడు సోహెల్ ఖతురియాతో వచ్చే నెలలో ఏడు అడుగులు వేయబోతోంది. ఇన్నాళ్లూ తన ప్రియుడి విషయాలని గోప్యంగా ఉంచిన ఈ బొద్దుగుమ్మ.. రీసెంట్‌గా అతనితో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసి, తనకు కాబోయే భర్త ఇతడేనంటూ మురిసిపోయింది.