Site icon NTV Telugu

Guardian : ఓటీటీలోకి వచ్చేసిన హన్సిక హారర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే…?

Whatsapp Image 2024 05 03 At 7.10.31 Am

Whatsapp Image 2024 05 03 At 7.10.31 Am

ఆపిల్ బ్యూటీ హన్సిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తెలుగులో వరుసగా స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో హిట్స్ తన ఖాతాలో వేసుకుంది .తన అందం నటనతో హన్సిక ఎంతగానో ఆకట్టుకుంది.ప్రస్తుతం ఈ భామ వరుసగా తమిళ సినిమాలు చేస్తూ మెప్పిస్తుంది.2022 డిసెంబర్‌లో తన ప్రియుడు మరియు బిజినెస్‌మెన్ సోహైల్ కథురియాను హన్సిక పెళ్లాడింది. ఓ వైపు కుటుంబ బాధ్యతల్ని నిర్వర్తిస్తూనే హన్సిక వరుసగా సినిమాలు చేస్తుంది.ఈ భామ హీరోయిన్‌గా నటించిన తమిళ హారర్ మూవీ గార్డియన్. ఈ మూవీకి శబరి గురు శరవణన్ దర్శకత్వం వహించాడు.

మార్చి 8న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయింది. ఈమూవీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.థియేటర్స్ లో విడుదల అయినా మొదటి వారమే ఈ మూవీ కనుమరుగైపోయింది.ఈ సినిమాలో హన్సిక యాక్టింగ్ మినహా హారర్ ఎలిమెంట్స్ , కామెడీ అంతగా బాగాలేదంటూ విమర్శలొచ్చాయి.అయితే ఈ సినిమా 2022లోనే మొదలైంది. అయితే షూటింగ్ డిలే కావడం,కొన్ని ఇతర కారణాల వల్ల ఈ సినిమా విడుదల ఆలస్యమైంది. షూటింగ్ పూర్తయిన రెండేళ్లకు ఈ మూవీ థియేటర్లలోకి వచ్చింది .కానీ ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. ఈ సినిమాలో హన్సికతో పాటు సురేష్ చంద్ర మీనన్ మరియు శ్రీమాన్ కీలక పాత్రలు పోషించారు. ఇదిలా ఉంటే ఈ మూవీ తాజాగా ఓటీటీలో రిలీజైంది. శుక్రవారం నుంచి సింప్లీ సౌత్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.అయితే ఓవర్‌సీస్ ఆడియెన్స్ మాత్రమే సింప్లీసౌత్ ఓటీటీలో ఈ హారర్ మూవీని చూడొచ్చు. ఇండియన్ ఆడియెన్స్ గార్డియన్‌ మూవీని చూడాలంటే మరో వారం ఎదురు చూడాలి . మే 10 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈ హారర్ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.మే 10 న ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో తమిళంతో పాటు తెలుగులో కూడా స్ట్రీమింగ్ కానుంది .

Exit mobile version