Site icon NTV Telugu

Hamsa Nandini : ఇట్స్ టైం ఫర్ ది సర్జరీస్… 16 సైకిల్స్ కీమోథెరపీ పూర్తి

Hamsa-Nandini

ప్రముఖ తెలుగు నటి హంసా నందిని బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతూ ప్రస్తుతం చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ బ్యూటీ 16 సైకిల్స్ కీమోథెరపీ చికిత్సను పూర్తి చేసినట్లు తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. అందులో తన గుండు తలను చూపిస్తూ ఇట్స్ టైం ఫర్ ది సర్జరీస్ అంటూ రాసుకొచ్చింది.

Read Also : Bheemla Nayak: అలా చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవు!

హంసా నందిని తన హాస్పిటల్ బెడ్ నుండి కొన్ని ఫోటోలను పంచుకుంటూ “అండ్…. 16 సైకిల్స్ కీమోథెరపీతో పూర్తి చేసాను!!! ఇప్పుడు నేను అధికారికంగా కీమో సర్వైవర్‌ని. కానీ ఇది ఇంకా పూర్తి కాలేదు… నేను ఇంకా గెలవలేదు. ఇది తదుపరి యుద్ధానికి సిద్ధమయ్యే సమయం… ఇట్స్ టైం ఫర్ ది సర్జరీస్. #epirubicin #acchemo #paclitaxel #chemosurvivor #brca1 #రొమ్ము క్యాన్సర్ #swanstories.” అంటూ చికిత్స ఎంత వరకు వచ్చింది అనే అప్డేట్ ను వెల్లడించింది.

డిసెంబరు 2021 చివరలో హంసా తనకు క్యాన్సర్‌ వచ్చినట్లు ప్రకటించింది. హంసా అసలు పేరు పూనమ్. అదే పేరుతో కెరీర్ మొదట్లో సినిమాలు చేసింది ఈ బ్యూటీ. అయితే చిత్ర పరిశ్రమలో పూనమ్ అనే పేరుతో చాలా మంది వ్యక్తులు ఉండడంతో దర్శకుడు వంశీ ఆమెకు హంసా నందిని అని పేరు పెట్టారు. ఆ తర్వాత మిర్చి, భాయ్, అత్తారింటికి దారేది, రామయ్య వస్తావయ్యా వంటి చిత్రాలలో ఐటమ్ సాంగ్స్ తో గుర్తింపు తెచ్చుకుంది.

Exit mobile version