NTV Telugu Site icon

Hai Nanna: మేము కూడా నిన్నే నమ్ముతున్నాం.. నాని అన్నా.. ఏం చేస్తావో.. ?

Nani

Nani

Hai Nanna: న్యాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా కొత్త దర్శకుడు శౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం
హయ్ నాన్న. వైరా ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 8 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మొదటి నుంచి కూడా ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. అందుకు కారణం.. నాని.. మరోసారి ఫాదర్ గా నటించడం ఒకటి అయితే.. సీతారామం సినిమాతో తెలుగువారి గుండెల్లో సీతగా స్థిరపడిన మృణాల్.. నటించడం రెండోది. ఇక ఖుషీ సినిమాతో తెలుగుతెరకు పరిచయమై మొదటి సినిమాతోనే అందరి హృదయాలను తనవైపు తిప్పుకున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహాబ్. ఈ సినిమాకు కూడా అతనే మ్యూజిక్ అందిస్తున్నాడు.

Vijay Devarakonda: లైగర్ రిజల్ట్ చూశాక కూడా మరోసారి రిస్క్ చేస్తున్నాడంటే.. ఏం గుండెరా అది..?

ఇకపోతే రిలీజ్ డేట్ దగ్గరపడుతుండే సరికిప్రమోషన్స్ మొదలుపెట్టారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తం ఖరారు చేశారు. అక్టోబర్ 15 న హయ్ నాన్న టీజర్ రానుందని అధికారికంగా మేకర్స్ తెలిపారు. దాంతో పాటు ఒక పోస్టర్ ను కూడా షేర్ చేశారు. మృణాల్, నాని ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ రొమాంటిక్ గా కనిపించిన పోస్టర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక నాని.. ఈ పోస్టర్ ను షేర్ చేస్తూ.. ” నేను నిన్ను నమ్ముతున్నాను .. నువ్వు నన్ను నమ్ము” అని రాసుకొచ్చాడు. దీంతో అభిమానులు సైతం మేము కూడా నిన్నే నమ్ముతున్నాం.. నాని అన్నా.. ఈ సినిమాతో నువ్వేం చేస్తావో చూడాలి అని కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమాతో నాని ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.

Show comments