NTV Telugu Site icon

Hai Nanna: ఎంత జాగ్రత్తగా ఆ హీరోయిన్ ను దాచారు మావా.. సూపర్ అంతే

Ritika

Ritika

Hai Nanna:న్యాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా కొత్త దర్శకుడు శౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హాయ్ నాన్న. వైరా ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటుంది. ఈ ఏడాది దసరా సినిమాతో వచ్చి మాస్ హిట్ కొట్టిన నాని.. హాయ్ నాన్నతో క్లాస్ హిట్ ను అందుకున్నాడు. ఇక మొదటి నుంచి సినిమాపై నాని చాలా నమ్మకంతో ఉన్నాడు. సినిమా మొదటి నుంచి చివరి వరకు బోర్ కొట్టదని, ఫ్రెష్ ఫీల్ ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఇక నాని చెప్పినట్లుగానే ప్రేక్షకులు హాయ్ నాన్న సినిమాను ఆదరించారు కథ,కథనాలతో పాటు నటీనటులు కూడా ఎంతో అద్భుతంగా నటించారని ప్రేక్షకులు చెప్పుకొస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రంలో శృతి హాసన్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించింది. ఒక ఇంటర్వ్యూలో నాని.. సినిమాలో చాలామంది ఉన్నారని, చూసి షాక్ అవుతారు అని చెప్పుకొచ్చాడు.

ఇక ఈ సినిమాలో సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా మారింది ఒక కుర్ర హీరోయిన్. అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది రితికా నాయక్. మెయిన్ హీరోయిన్ కన్నా ఈమెనే ఎక్కువ పాపులర్ అయ్యింది. ఆ సినిమా తరువాత తెలుగు కుర్రాళ్ల గుండెల్లో క్రష్ గా నిలిచింది. ఇక ఈ చిన్నది హాయ్ నాన్న చిత్రంలో సందడి చేసింది. ఏ పాత్రలో అనుకున్నారు. నాని ముద్దుల కూతురు మహీగా కనిపించింది. చిన్నప్పుడు ఉన్న మహీని మాత్రమే బయట చూపించారు. ఆమె టీనేజ్ లోని పాత్రను రితికా చేసింది. జెర్సీలో ఎలా అయితే తండ్రి గురించి కొడుకు అర్జున్ చెప్తాడో.. ఇందులో తల్లిదండ్రుల కథ గురించి రితికా చెప్పడంతో సినిమా మొదలవుతుంది. నాని కూతురిగా రితికాను చూసి అభిమాను షాక్ అవుతున్నారు. ఎంత జాగ్రత్తగా ఆ హీరోయిన్ ను దాచారు మావా.. సూపర్ అంతే అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

Show comments