NTV Telugu Site icon

Guntur Kaaram: మహేష్ బర్త్ డే గిఫ్ట్ లేనట్టే.. ఇక ఆశలు వదిలేయడమే

Mahesh

Mahesh

Guntur Kaaram: ఆగస్టు 9.. అనగానే సూపర్ స్టార్ అభిమానులు పండగ మొదలుపెట్టేస్తారు. ఎందుకంటే ఆరోజే సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే కాబట్టి. సాధారణంగా అయితే ఇప్పటికే మహేష్ బర్త్ డే వేడుకలు మొదలయ్యాయి. కానీ, ఒక చిన్న నిరాశ మాత్రం మిగిలిపోయింది. సాధారణంగా ఏ హీరో పుట్టినరోజు అయినా ఆరోజు హీరో నటించే లేటెస్ట్ సినిమాకు సంబంధించిన పోస్టర్ కానీ, టీజర్ కానీ, సాంగ్ కానీ.. కనీసం ఒక ఫస్ట్ గ్లింప్స్ కానీ రిలీజ్ చేసి హీరోకు బర్త్ డే విషెస్ తెలపడం ఆచారంగా వస్తుంది. ఇక దీంతో మహేష్ నటిస్తున్న తాజా చిత్రం గుంటూరు కారం నుంచి ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్లు ఎప్పటినుంచో వస్తున్న రూమర్స్. త్రివిక్రమ్- మహేష్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో గుంటూరు కారం పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. అయితే అభిమానులు ఎన్ని ఆశలు అయితే పెట్టుకున్నారో.. మేకర్స్ ఆశలను నిరాశలు చేస్తున్నారు. సినిమా మొదలైనప్పటినుంచి ఈ సినిమా ఎన్నో ఆటంకాలను ఎదుర్కొంటూనే ఉంది.

Daya 2: ఆ అననుమానాలు తీర్చేసేది అప్పుడే.. దయా 2 రిలీజ్ అయ్యేది ఎప్పుడంటే?

ఏది ఏమైనా సినిమా షూటింగ్ పూర్తిచేయడం.. మహేష్ పుట్టినరోజుకు కనీసం ఒక సాంగ్ ప్రోమోను రిలీజ్ అయినా చేస్తారని ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూశారు. అయితే ఇక్కడ కూడా వాళ్లకు చుక్కెదురే అయ్యింది. ఎందుకంటే.. ఈ పాట మహేష్ వరకు చేరలేదని, మహేష్ కు చేరి నచ్చితేనే రిలీజ్ చేయాలనీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ముంబై కు చేరుకున్నాడు. అది కూడా కేవలం ట్యూన్ రికార్డింగ్ కు అని సమాచారం. మహేష్ ఓకే చెప్తే ఏ క్షణం లో అయినా పాట ఇవ్వడానికి అవకాశం వుంటుందేమో అని, పాటకు ప్రోమో కూడా కట్ చేసి వుంచారట. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియదు. దీంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. రేపు మహేష్ బర్త్ డే ట్రీట్ ఏది ఉండదని తెలిసేసరికి నిరాశలో మునిగిపోయారు. మరి కనీసం కొత్త పోస్టర్ అయినా రిలీజ్ చేసి ఫ్యాన్స్ కంటనీరు తుడుస్తారేమొ చూడాలి.

Show comments