Gunturu Kaaram: రిలీజ్ కు ముందే రూ. 20 కోట్లు నష్టం.. నిజమేనా గురూజీ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gunturu Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో చినబాబుతో కలిసి సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక ఏ ముహుర్తానా ఈ సినిమా మొదలయ్యిందో కానీ, అప్పటినుంచి అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. సినిమా పూజా మొదలయ్యి షూటింగ్ జరుపుకుంటుంది అనుకొనేలోపు కృష్ణ మృతి చెందారు. గ్యాప్ వచ్చింది. ఆ తరువాత ఒక యాక్షన్ షెడ్యూల్ ను ఫినిష్ చేశారు అని తెలియగా అభిమానులు సంతోషపడ్డారు. అంతలోనే అది మహేష్ కు నచ్చకపోవడంతో తీసేశారని టాక్ రావడంతో మళ్లీ గ్యాప్ వచ్చింది. ఇక ఆ గ్యాప్ ను ఎలాగైనా ఫుల్ ఫిల్ల్ చేస్తారు అనుకొనే లోపు.. మహేష్ వెకేషన్స్ కోసం మరోసారి గ్యాప్.. ఇలా షూటింగ్ ల మధ్య గ్యాప్ తీసుకుంటున్నారో.. గ్యాపు ల మధ్య షూటింగ్ చేస్తున్నారో అభిమానులకు అర్ధమే కాలేదు. సరే ఇవన్నీ పక్కన పెట్టి రెండు నెలలుగా కంటిన్యూగా షూటింగ్ చేస్తున్నారు అనుకొనేలోపు.. హీరోయిన్ పూజా హెగ్డే అవుట్ అంటూ బాంబ్ వేశారు.
Ambati Rambabu: రోత స్టార్.. బూతు స్టార్.. పవన్ కళ్యాణ్
Also Read
- Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
- ‘గాడ్ ఆఫ్ వార్’ అఫిషియల్ టైటిల్ కాదు.. NTR - Trivikram Movie పై నాగవంశీ బిగ్ క్లారిటీ!
- Naga Vamsi: ‘జైలర్ 2 హై రేట్ పెట్టి ఎందుకు కొన్నానంటే'.. అసలు నిజం చెప్పిన నాగవంశీ!
- Director Gowri Naidu: ఆ ఫోన్ కాల్ నా జీవితాన్ని మార్చేసింది: ‘గరివిడి లక్ష్మి’ డైరెక్టర్
ఇప్పటికే నిర్మాతలకు ఈ షూటింగ్ రీషూట్ చేయడానికి.. రూ. 5 కోట్లు అయ్యాయని టాక్. మళ్లీ ఇప్పుడు హీరోయిన్ ను మార్చడం కోసంమరింత డబ్బు ఖర్చుపెడుతున్నారట మేకర్స్. మొదట పూజా చేసిన సీన్స్ ను మళ్లీ రీ షూట్ చేయడానికి ఇంకొన్ని కోట్లు నష్టమని టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కోసం మేకర్స్ దాదాపు 20 కోట్లు కంటే ఎక్కువే ఖర్చుపెట్టారంట. అదంతా ఇప్పుడు నిర్మాతల అకౌంట్ లోనే పడిందని టాక్. ఒకవిధంగా చెప్పాలంటే రిలీజ్ కు ముందే ఈ సినిమా రూ. 20 కోట్లు నష్టంను మిగిల్చింది అని అభిమానులు చెప్పుకుంటున్నారు. మరి ఇప్పుడైనా ఈ సినిమా షూటింగ్ సజావుగాసాగుతుందా..? లేక మళ్లీ మెలికలు పెడతారా..? అనేది తెలియాల్సి ఉంది. మరి ఈ వార్తల్లో నిజం ఉందో లేదో మేకర్స్ కే తెలియాలి అంటున్నారు నెటిజన్లు.
తాజావార్తలు
-
World Records: ఐదు మ్యాచ్‌ల్లో 1864 పరుగులు.. టీ20 సిరీస్‌లో సరికొత్త రికార్డులు..
-
Rajahmundry: 11 గ్రామ పంచాయతీల విలీనానికి గెజిట్ విడుదల.. మహానగరంగా రాజమహేంద్రవరం!
-
AP Municipal Elections 2026: నేటితో ముగియనున్న నామినేషన్ల పర్వం.. విజయవాడలో రాజకీయ వేడి!
-
Shreyas Iyer: సూర్యవంశీకి ఛాన్స్ దక్కకపోవడానికి కారణం ఇదే.. క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ శ్రేయస్
-
Haizil Jebin: 20 బ్యాక్‌లాగ్స్.. జొమాటో డెలివరీ బాయ్..సీన్ కట్ చేస్తే పైలట్..!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!