NTV Telugu Site icon

Unstoppable: బాలయ్య తో మరోసారి మహేష్.. ?

Mahesh

Mahesh

Unstoppable: నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 3 నడుస్తున్న విషయం తెల్సిందే. ఈ సీజన్ 3.. చాలా తక్కువ ఎపిసోడ్స్ ఉంటాయని మేకర్స్ ముందే క్లారిటీ ఇచ్చారు. అందుకే ప్రతివారం కాకుండా చాలా సెలక్టివ్ గా ఎపిసోడ్స్ ను ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ సీజన్ లో రెండు ఎపిసోడ్స్ మాత్రమే స్ట్రీమింగ్ అయ్యాయి. భగవంత్ కేసరి టీమ్ ఒకటి.. యానిమల్ టీమ్ ఒకటి సందడి చేసాయి. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడో ఎపిసోడ్ లో గుంటూరు కారం టీమ్ సందడి చేయనుందని టాక్ నడుస్తోంది. బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోకు మహేష్ బాబు మరోసారి రాబోతున్నాడు. సీజన్ 2 లో మహేష్ బాబు సందడి చేసిన విషయం తెల్సిందే. ఇక రెండోసారి.. బాలయ్యతో మహేష్ సందడి చేయనున్నాడు.

ఇక ఈసారి మహేష్ తో పాటు డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా ఈ షోలో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. లాస్ట్ సీజన్ లో పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు త్రివిక్రమ్ వస్తాడనుకున్నారు. కానీ, ఆ ప్లేస్ లో డైరెక్టర్ క్రిష్ వచ్చాడు. ఇక ఈసారి గురూజీ.. మహేష్ తో పాటు రానున్నాడని తెలుస్తోంది. వీరితో పాటు నిర్మాత సూర్యదేవర నాగవంశీ, శ్రీలీల కూడా వస్తున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ, బాలయ్య సెటైర్లు.. మహేష్ బాబు పంచ్ లతో గత ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఈసారి అంతకు మించి ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. మరి దీనిపై ఆహా ఏమైనా అధికారిక ప్రకటన ఇస్తుందేమో చూడాలి.