Site icon NTV Telugu

Guntur Kaaram: మమ్మల్ని క్షమించండి.. ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగడం లేదు

Mahesh

Mahesh

Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు మరియు సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక జనవరి 12 న సంక్రాంతి రేసులో గుంటూరు కారం దిగుతుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. రోజుకో మాస్ పోస్టర్ తో అలరిస్తున్నారు. ఇంకోపక్క ఈ సినిమా ట్రైలర్ ను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేసిన విషయం తెల్సిందే. జనవరి 6 న హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ తో గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా జరుపుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రచ్చ చేయడానికి ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు. అయితే.. చివరి నిమిషంలో ఫ్యాన్స్ కు మేకర్స్ బ్యాడ్ న్యూస్ చెప్పారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా పడిందని అధికారికంగా తెలిపారు.

“మేము ఎంత ప్రయత్నించినప్పటికీ, ఊహించని పరిస్థితులు మరియు భద్రతా అనుమతుల సమస్యల కారణంగా, మేము 6 జనవరి 2024న ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గుంటూరు కారం ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించడం లేదు. ఇందుకు మేము హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాము. మరో కొత్త వేదికతో కొత్త తేదీని వీలైనంత త్వరగా ప్రకటిస్తాం” అని చెప్పుకొచ్చారు. దీంతో అభిమానుల ఆశలు ఆవిరి అయ్యాయి. మరి కొత్త డేట్ ఎప్పుడు ఉంటుందో చూడాలి.

Exit mobile version