సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మూడో సారి కలిసి చేస్తున్న సినిమా గుంటూరు కారం. జనవరి 12న రీజనల్ బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తూ గుంటూరు కారం రిలీజ్ కానుంది. అనౌన్స్మెంట్ నుంచే హైప్ మైంటైన్ చేస్తున్న ఈ మూవీ నుంచి బయటకి వచ్చే ప్రమోషనల్ కంటెంట్ ఘట్టమనేని అభిమానుల్లో జోష్ పెంచుతోంది. మాస్ స్ట్రైక్ వీడియో, పోస్టర్స్, ధమ్ మసాలా సాంగ్ గుంటూరు కారం సినిమాపై అభిమానుల అంచనాలని మరింత పెంచాయి.…