Guntur Kaaram: రేయ్.. రేయ్.. సినిమా మొత్తం లీక్ చేసి పడేస్తున్నారు కదరా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు మరియు సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు.. లీకుల బెడద మాత్రం పోవడం లేదు. కొన్నిసార్లు ఆడియో సాంగ్స్ లీక్ అవుతుంటే.. ఇంకొన్నిసార్లు షూటింగ్ వీడియోస్ లీక్ అయ్యాయి. ధం మసాలా బిర్యానీ ఆడియో లీక్ అయ్యింది.. ఆ తరువాత వెంటనే మేకర్స్ అధికారికంగా ఆ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు ఒక మాస్ సాంగ్ షూటింగ్ వీడియో లీక్ అయ్యింది. ఇందులో శ్రీలీల చీరకట్టులో కనిపించగా.. మహేష్ ఫ్యాన్సీ లుక్ లో అదరగొట్టాడు. ఈ సాంగ్ కాస్ట్యూమ్స్ బట్టి ఇది మాస్ సాంగ్ లా అనిపిస్తుంది.
ప్రస్తుతం ఈ లీకెడ్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ లీక్స్ పై అభిమానులు మండిపడుతున్నారు. రేయ్.. రేయ్.. సినిమా మొత్తం లీక్ చేసి పడేస్తున్నారు కదరా.. అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .ఇలాంటి పనులు చేయొద్దని హెచ్చరిస్తున్నారు. సినిమాపై ఇంట్రెస్ట్ లేకుండా పోతుందని చెప్పుకొస్తున్నారు. అయినా కూడా కొందరు వ్యూస్ కోసం, లైక్స్ కోసం ఇలాంటి వీడియోస్ ను షేర్ చేస్తున్నారు. మేకర్స్ .. ఇకనుంచి అయినా ఇలాంటి లీక్స్ అవ్వకుండా చూసుకుంటే బావుంటుందని చెప్పుకొస్తున్నారు. సంక్రాంతి కానుకగా గుంటూరు కారం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా మహేష్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
Also Read
- Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
- Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
- Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
- Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
#GunturKaraam pic.twitter.com/9JaG5GwSKp
— Steve (@Steve_phani1) December 19, 2023
తాజావార్తలు
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!