Guntur Kaaram: కుర్చీని మడతబెట్టి.. ఫుల్ సాంగ్ వచ్చేసింది.. చూశారా ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Guntur Kaaram:అతడు, ఖలేజా తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబో గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్దమయ్యింది. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు మరియు సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక మహేష్ ఊర మాస్ లుక్, శ్రీలీల అందాలు.. మీనాక్షి చౌదరి .. ఇలా ఈ సినిమాపై ఎన్నో అంచనాలను పెట్టుకొనేలా చేశాయి. సంక్రాంతికి గుంటూరు కారం రిలీజ్ కానుంది. తిప్పి తిప్పి కొడితే ఇంకా 10 రోజులు కూడా లేదు సంక్రాంతికి.. కానీ, ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టలేదని అభిమానులు డిజప్పాయింట్ అవుతున్నారు. కానీ, కంటెంట్ ఉన్నవాడికి కటౌట్ అవసరం లేదన్నట్లు.. మహేష్ సినిమా ప్రమోషన్స్ లేట్ గా స్టార్ట్ అయినా ట్రెండ్ సెట్ చేయడంలో మాత్రం లేటెస్ట్ అని ఎప్పటికప్పుడు రుజువు అవుతూనే ఉంది.
ఇక తాజాగా ఈ సినిమా నుంచి మూడో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. కుర్చీని మడతబెట్టి అంటూ సాగే ఈ సాంగ్ ప్రోమో రిలీజ్ అయినదగ్గరనుంచి సోషల్ మీడియా షేక్ అవుతున్న విషయం తెల్సిందే. ఇక కొద్దిసేపటి క్రితమే ఫుల్ లిరికల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. థమన్ మ్యూజిక్, మహేష్, శ్రీలీల స్టెప్స్ నెక్స్ట్ లెవెల్.. రామజోగయ్య ఆడించిన లిరిక్స్, సాహితి, శ్రీ కృష్ణ వాయిస్ బావుంది. ట్రోలింగ్ పక్కన పెడితే.. మంచి జోష్ ఉన్న సాంగ్ అని చెప్పొచ్చు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Also Read
- SlumDog – 33 Temple Road: 'స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్' కు డబ్బింగ్ చెప్పిన విజయ్ సేతుపతి... టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
- Anasuya: బాధ్యత ఉండక్కర్లా.. బుచ్చిబాబు'కి అనసూయ పరోక్ష కౌంటర్?
- Peddi Collections : బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' కలెక్షన్ల సునామీ.. ఏకంగా ఎన్ని కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందో తెలిస్తే మైండ్ బ్లాక్!
- Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి... తెలుగులోనూ స్ట్రీమింగ్
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్‌కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!