Site icon NTV Telugu

Guntur Kaaram: Day 1… అన్ని సెంటర్స్ లో ఆల్ టైం రికార్డ్!

Guntur Kaaram

Guntur Kaaram

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజ్ ఎలా ఉందో… ప్రస్తుతం గుంటూరు కారం హైప్ చూస్తే చెప్పొచ్చు. అతడు, ఖలేజా సినిమాల్లా కాకుండా సాలిడ్ థియేటర్ హిట్ కొట్టేలా మాస్ బొమ్మగా గుంటూరు కారం వస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ చూస్తే… మహేష్‌ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టేలా ఉంది గుంటూరు కారం. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. మహేష్ బాబు ఎమోషనల్ స్పీచ్‌తో గుంటూరు కారం పై మరింత పాజిటివ్ బజ్ ఏర్పడింది. పైగా ఈ సినిమాలో సరికొత్త మహేష్‌ని చూస్తారు అని… స్వయంగా సూపర్ స్టారే చెప్పడం సూపర్ హైప్ ఇచ్చింది. దీంతో ఆల్ టైం రికార్డ్ రేంజ్‌లో జనవరి 12న ఈ సినిమా రిలీజ్ అవుతోంది. డే వన్ షోలతోనే ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది గుంటూరు కారం.

Read Also: Nagarjuna: అక్కినేని ఫ్యాన్స్ గెట్ రెడీ… ‘నా సామిరంగ’ ఈ రోజే!

యూఎస్‌ఏలో 5408 ప్లస్ షోలతో రిలీజ్ అవుతుండగా… తెలుగు రాష్ట్రాల్లోను అత్యధిక థియేటర్లో రిలీజ్ అవుతోంది. ఒక్క హైదరాబాద్‌లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో ఫస్ట్ డే 41 ప్లస్ షోలు పడుతున్నాయి. AMB సినిమాస్‌లోను మొదటి రోజు 42+ షోలు పడుతున్నాయి. దీంతో డే వన్ హైయెస్ట్ షోస్ పడుతున్న సినిమాగా గుంటూరు కారం ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది. ఇదే విషయాన్ని టాప్‌లో ట్రెండ్ చేస్తున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. చాలా రోజుల త‌ర్వాత ఔట్ అండ్ ఔట్ మాస్ మూవీగా… పోకిరి రేంజ్‌లో గుంటూరు కారం వస్తోంది. ఈ సినిమాలో శ్రీలీల‌, మీనాక్షి చౌద‌రి హీరోయిన్లుగా న‌టించారు. తమన్ మ్యూజిక్ అందించాడు. మరి గుంటూరు కారం ఎలా ఉంటుందో చూడాలి.

Exit mobile version