HHVM : పవన్ కల్యాణ్ నటిస్తున్న వీరమల్లు మూవీ మరో 12 రోజుల్లో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లు కూడా జోరుగా చేస్తున్నారు. అయితే టికెట్ రేట్ల పెంపు కోసం నిర్మాత ఏఎం రత్నం ప్రయత్నాలు మొదలు పెట్టారు. నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మాట్లాడారు. తెలంగాణలో టికెట్ రేటుపు రూ.250 వరకు పెంచుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. తెలగాణలో టికెట్ రేట్లను ఎక్కువ పెంచుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు.
Read Also : Ambati Rambabu: మహానాడు తుస్సుమంది.. అంబటి సెటైర్లు
సంధ్య థియేటర్ ఘటన తర్వాత ప్రీమియర్స్ క్లోజ్ చేసేసింది. టికెట్ రేట్లను కూడా భారీగా పెంచుకోవడాన్ని తగ్గించేసింది. బడ్జెట్ మరీ ఎక్కువ ఉంటే ఎంతో కొంత వరకు మాత్రమే పెంచుకునేందుకు ఛాన్స్ ఇస్తోంది. ఇప్పుడు వీరమల్లుకు కూడా ఒక వారం వరకు ఈ పెరిగిన ధరలు అమలు అయ్యేలా కనిపిస్తోంది. వారం తర్వాత సాధారణ రేట్లు ఉండబోతున్నాయి.
అటు ఏపీలో మాత్రం ఫిలిం ఛాంబర్ ద్వారానే అప్లై చేసుకోవాలని ఇప్పటికే పవన్ సూచించారు. ఆ ప్రాసెస్ ను ఫాలో అవుతున్నాడంట ఏఎం రత్నం. ప్రస్తుతానికి ఫిలిం ఛాంబర్ ద్వారా అప్లై చేసుకున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే దానికి గ్రీన్ సిగ్నల్ రాబోతోంది. అయితే ఏపీలో కాస్త ఎక్కువగానే పెంచుకునే అవకాశాలు ఉన్నాయి.
Read Also : JD Vance: ఎలాన్ మస్క్ శకం ముగియలేదు.. ట్రంప్‌కు సలహాలిస్తారు
