Site icon NTV Telugu

Trivikram: గురూజీ 500 కోట్ల ప్రాజెక్ట్ లోడింగ్?

Trivikram

Trivikram

తెలుగు ఆడియన్స్ అందరూ ముద్దుగా గురూజీ అని పిలుచుకునే త్రివిక్రమ్ చివరిగా గుంటూరు కారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఓ మాదిరి డిజాస్టర్ టాక్ అందుకున్నారు. ఆయన చేసిన చాలా సినిమాలు సూపర్ హిట్లయ్యాయి కానీ ఎందుకో పాన్ ఇండియా వైపు ఆయన ఇప్పటివరకు పయనించలేదు. ఎక్కువగా ఆయన ఫ్యామిలీ సెంటిమెంట్స్, లవ్ ఎంటర్టైన్మెంట్ వంటి వాటి మీద ఫోకస్ చేస్తూ ఉండడంతో అవి ప్యాన్ ఇండియాకి వర్కౌట్ కాక ఆపేసి ఉండవచ్చని అందరూ భావించారు.

Prabhas : ప్రభాస్ షాక్.. ఆ స్టార్ హీరోతో స్క్రీన్ షేరింగ్ కి నో?

అయితే ఇప్పుడు ఆయన సాధారణంగా చేసే సినిమాలు మించి ఒక మంచి సినిమా కథ సిద్ధం చేసుకున్నాడని, దాని కోసం మినిమం 500 కోట్ల వరకు బడ్జెట్ అవుతుంది అని తెలుస్తోంది. మైధలాజికల్ ఎలిమెంట్స్ ఉన్న ఒక ఫాంటసీ డ్రామా ఆయన సిద్ధం చేసుకున్నాడని తెలుస్తోంది. ఈ 500 కోట్ల బడ్జెట్ సినిమాకి అల్లు అర్జున్ హీరోగా ఉండబోతున్నారు. పుష్ప సిరీస్ తర్వాత అల్లు అర్జున్ కి నార్త్ సహా దేశవ్యాప్తంగా మంచి పేరు వచ్చింది. ఆయన సినిమాలకు మంచి బిజినెస్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే 500 కోట్ల రూపాయల బడ్జెట్ అయినా అల్లు అర్జున్ మీద పెట్టవచ్చని, త్రివిక్రమ్ ధైర్యం చేసినట్లుగా తెలుస్తోంది. ఏప్రిల్ 2025లో ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. ఎప్పటిలాగానే హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ మీద ఈ సినిమా తెరకెక్కే అవకాశం ఉంది.

Exit mobile version