Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?

Tollywood

Tollywood

Tollywood: టాలీవుడ్ తెర వెనుక అసలేం జరుగుతోంది? నివురు గప్పిన నిప్పులా ఉండే చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఓ సంచలన వ్యవహారం గుప్పుమంటోంది. తెర వెనుక ఉంటూ ప్రాజెక్ట్‌లను శాసించే ఓ అగ్రశ్రేణి టెక్నీషియన్‌కు.. ఇండస్ట్రీని ఏలుతున్న బడా నిర్మాతలు నేరుగా ఫోన్ చేసి తీవ్ర హెచ్చరికలు జారీ చేసినట్లు ఫిలింనగర్ వర్గాల్లో గుసగుసలు జోరుగా వినిపిస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఇటీవల కాలంలో ఆ టెక్నీషియన్ వ్యవహారశైలిపై పలువురు నిర్మాతలు గుర్రుగా ఉన్నారట. ప్రాజెక్ట్‌ల విషయంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, తెర వెనుక చేస్తున్న కొన్ని లాబీయింగ్‌లు సదరు నిర్మాతలకు ఆగ్రహం తెప్పించినట్లు సమాచారం. దీంతో నిర్మాతలు రంగంలోకి దిగి, ఆ టాప్ టెక్నీషియన్‌కి నేరుగా ఫోన్ చేసి గట్టిగా మందలించినట్లు తెలుస్తోంది.

“పరిశ్రమలో ఏం జరుగుతుందో మొత్తం మా దృష్టిలో ఉంది.. ఏదీ మాకు తెలియకుండా జరగడం లేదు. ఇన్నాళ్లూ చూసీచూడనట్లు ఊరుకున్నాం. ఇప్పటికైనా ఈ తీరు మార్చుకోకపోతే మాత్రం పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి” అంటూ సదరు నిర్మాతలు ఫోన్‌లోనే కఠిన హెచ్చరికలు జారీ చేసినట్లు టాక్. సాధారణంగా పెద్ద టెక్నీషియన్లతో నిర్మాతలు చాలా ఆచితూచి వ్యవహరిస్తుంటారు. అలాంటిది అగ్ర నిర్మాతలు ఒకేసారి, ఫోన్ చేసి మరీ ‘పరిణామాలు సీరియస్‌గా ఉంటాయి’ అని వార్నింగ్ ఇచ్చారంటే వ్యవహారం ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. దీంతో ఆ అగ్ర టెక్నీషియన్ ఎవరు? ఏ ప్రాజెక్ట్ వ్యవహారంలో ఈ వివాదం రాజుకుంది? అన్నది ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్‌గా మారింది. ఈ పరిణామం మరింత ముదిరి బయటికి పొక్కుతుందా లేదంటే అంతర్గతంగానే సద్దుమణుగుతుందా అన్నది వేచి చూడాలి.