Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tollywood: టాలీవుడ్ తెర వెనుక అసలేం జరుగుతోంది? నివురు గప్పిన నిప్పులా ఉండే చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఓ సంచలన వ్యవహారం గుప్పుమంటోంది. తెర వెనుక ఉంటూ ప్రాజెక్ట్‌లను శాసించే ఓ అగ్రశ్రేణి టెక్నీషియన్‌కు.. ఇండస్ట్రీని ఏలుతున్న బడా నిర్మాతలు నేరుగా ఫోన్ చేసి తీవ్ర హెచ్చరికలు జారీ చేసినట్లు ఫిలింనగర్ వర్గాల్లో గుసగుసలు జోరుగా వినిపిస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఇటీవల కాలంలో ఆ టెక్నీషియన్ వ్యవహారశైలిపై పలువురు నిర్మాతలు గుర్రుగా ఉన్నారట. ప్రాజెక్ట్‌ల విషయంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, తెర వెనుక చేస్తున్న కొన్ని లాబీయింగ్‌లు సదరు నిర్మాతలకు ఆగ్రహం తెప్పించినట్లు సమాచారం. దీంతో నిర్మాతలు రంగంలోకి దిగి, ఆ టాప్ టెక్నీషియన్‌కి నేరుగా ఫోన్ చేసి గట్టిగా మందలించినట్లు తెలుస్తోంది.
“పరిశ్రమలో ఏం జరుగుతుందో మొత్తం మా దృష్టిలో ఉంది.. ఏదీ మాకు తెలియకుండా జరగడం లేదు. ఇన్నాళ్లూ చూసీచూడనట్లు ఊరుకున్నాం. ఇప్పటికైనా ఈ తీరు మార్చుకోకపోతే మాత్రం పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి” అంటూ సదరు నిర్మాతలు ఫోన్లోనే కఠిన హెచ్చరికలు జారీ చేసినట్లు టాక్. సాధారణంగా పెద్ద టెక్నీషియన్లతో నిర్మాతలు చాలా ఆచితూచి వ్యవహరిస్తుంటారు. అలాంటిది అగ్ర నిర్మాతలు ఒకేసారి, ఫోన్ చేసి మరీ ‘పరిణామాలు సీరియస్‌గా ఉంటాయి’ అని వార్నింగ్ ఇచ్చారంటే వ్యవహారం ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. దీంతో ఆ అగ్ర టెక్నీషియన్ ఎవరు? ఏ ప్రాజెక్ట్ వ్యవహారంలో ఈ వివాదం రాజుకుంది? అన్నది ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్‌గా మారింది. ఈ పరిణామం మరింత ముదిరి బయటికి పొక్కుతుందా లేదంటే అంతర్గతంగానే సద్దుమణుగుతుందా అన్నది వేచి చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
-
Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! ‘పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్’
-
SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
-
Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
-
Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!