మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాల తో ఎంతో బిజీ గా వున్నాడు.గతం లో ప్రకటించిన అన్ని సినిమాలు కూడా ఒకదాని తర్వాత మరొకటి షూటింగ్ పూర్తి చేసి విడుదల చేయడం జరిగింది. రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత కూడా రవితేజ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నట్లు సమాచారం.వంశీ దర్శకత్వం లో తెరకెక్కుతున్న టైగర్ నాగేశ్వరరావు పాన్ ఇండియా స్థాయి లో రూపొందుతుంది.ఈ సినిమా గ్లింప్స్ ను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసిన విషయం తెలిసిందే.ఈ సినిమాను అక్టోబర్ 20 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.దీని తర్వాత దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం లో ఈగల్ సినిమాను కూడా ఇటీవలే ప్రకటించాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది 2024 సంక్రాంతి టార్గెట్ గా విడుదల కాబోతుంది.
అలాగే దీంతో పాటు రవితేజ తనకు క్రాక్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాను అందించిన గోపీచంద్ మలినేని తో ఒక సినిమాను చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా మైత్రి మూవీస్ బ్యానర్ లో తెరకెక్కనుందని సమాచారం.ఈ సినిమా మాత్రమే కాదు సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో కూడా ఒక సినిమాను చేయడానికి ఒప్పుకున్నట్లు సమాచారం.అలాగే ధమాకా వంటి భారీ హిట్ ఇచ్చిన త్రినాధరావు నక్కిన దర్శకత్వం లో కూడా మరో సినిమా చేయబోతున్నట్లు సమాచారం.. ఇలా వరుస సినిమాలు లైన్లో పెడుతూనే తనకు మిరపకాయ్ వంటి మంచి సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్ హరీష్ శంకర్ తో కూడా రవితేజ ఒక సినిమా చేయబోతున్నట్లు సమాచారం అందుతుంది.దర్శకుడు హరీష్ శంకర్ సన్నిహితులు ఈ వార్త ను లీక్ చేసినట్టు సమాచారం… ఈ నెలలోనే ఈ సినిమా అఫిషియల్ అప్డేట్ వస్తుందని తెలుస్తుంది.. రవితేజ రానున్న రెండు సంవత్సరాలలో చేసే సినిమాలను ఇప్పటికే లైన్ లో పెట్టేసాడు.