NTV Telugu Site icon

Ram Charan -Prashanth Neel: దానయ్య సమర్పించు ప్రశాంత్ నీల్ తో రామ్ చరణ్?

Dvv Danayya Prashanth Neel

Dvv Danayya Prashanth Neel

Ram Charan -Prashanth Neel With DVV Danayya: రామ్ చరణ్ తేజ ప్రస్తుతానికి శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ పూర్తి చేసి బుచ్చిబాబు దర్శకత్వంలో చేయాల్సిన సినిమా కోసం బాడీ బిల్డింగ్ చేసే పనిలో ఉన్నాడు. ఈ సమయంలో ఆయన మరో సినిమా పట్టాలు ఎక్కించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ సినిమా ద్వారా ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత ప్రభాస్ తో వచ్చిన సలార్ ఆయనకు మరింత గుర్తింపు తీసుకువచ్చింది. ప్రస్తుతానికి ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లలేదు. సరిగ్గా ఇలాంటి సమయంలో రాంచరణ్ తో ప్రశాంత్ నీల్ సినిమా ఫైనల్ అయిందని అంటున్నారు.

RK Roja: పంచె ఎగ్గాట్టాల్సింది గుడి మెట్లపై కాదు.. పవన్‌పై రోజా ట్వీట్

డివివి దానయ్య నిర్మాణంలో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. నిజానికి 2021లో రామ్ చరణ్ తేజ, ప్రశాంత్ నీల్ తో పాటు డివివి దానయ్యను తన ఇంటికి ఆహ్వానించి ఒక డిన్నర్ కూడా ఇచ్చారు. అప్పట్లోనే వీరు సినిమా చేస్తారని ప్రచారం జరిగింది. అయితే అప్పటి నుంచి మళ్లీ ఈ ప్రచారం ఊసే లేదు కానీ ఈరోజు మధ్యాహ్నం నుంచి మరోసారి ఈ కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం మొదలైంది. ప్రస్తుతానికి ప్రశాంత్ జూనియర్ ఎన్టీఆర్ తో చేసే సినిమా మీద పూర్తిస్థాయిలో ఫోకస్ చేశారు. ఆ సినిమా పూర్తి అయిన తర్వాత రామ్ చరణ్ తో సినిమా పట్టాలు ఎక్కే అవకాశం ఉంది అని అంటున్నారు.

Show comments