Jr NTR: ‘NTRTAIN’తో కొత్త ఇన్నింగ్స్.. సొంత ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన జూనియర్ ఎన్టీఆర్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jr NTR: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ సినీ రంగంలో మరో కీలక అడుగు వేశారు. ఇప్పటివరకు హీరోగా వరుస సక్సెస్‌లతో దూసుకెళ్తున్న తారక్.. తాజాగా తన సొంత ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభించినట్లు సమాచారం. ‘NTRTAIN’ పేరుతో ఈ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసినట్లు జోరుగా వార్తలు ప్రచారం అవుతున్నాయి. NTR + ENTERTAIN = NTRTAIN అని జూనియర్ ఎన్టీఆర్ తన ప్రొడక్షన్ హౌస్‌కు పేరు పెట్టినట్లు చెబుతున్నారు. ఎన్టీఆర్ పేరులోని ‘NTR’తో పాటు ఎంటర్టైన్మెంట్ను కలిపి ‘NTRTAIN’ అనే పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సినిమా, వినోదం అనే రెండు అంశాలను ప్రతిబింబించేలా ఈ పేరును డిజైన్ చేసినట్లు సమాచారం. తన పేరుతో పాటు సినిమాపై ఉన్న అభిరుచిని కూడా ఈ బ్రాండ్ ద్వారా చాటేలా తారక్ ఈ పేరును ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
ఈ నిర్మాణ సంస్థకు జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు ఆయన సతీమణి ప్రణతి డైరెక్టర్లుగా వ్యవహరించనున్నట్లు సమాచారం. ఇప్పటికే హీరోగా పాన్ ఇండియా స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్.. ఇక నిర్మాతగానూ తనదైన ముద్ర వేయడానికి సిద్ధమవుతున్నారనే చర్చ ఇప్పుడు ఇండస్ట్రీలో మొదలైంది. ‘NTRTAIN’ ద్వారా ఎలాంటి సినిమాలను నిర్మించబోతున్నారు? కేవలం ఎన్టీఆర్ నటించే చిత్రాలనే నిర్మిస్తారా? లేక కొత్త కథలు, కొత్త దర్శకులు, యువ ప్రతిభను ప్రోత్సహించేలా సినిమాలు తెరకెక్కిస్తారా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. అయితే నిర్మాణ సంస్థకు సంబంధించిన పూర్తి వివరాలు, తొలి ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమవుతుంది? అనే విషయాలపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఒకవైపు స్టార్ హీరోగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టడం ఆసక్తికరంగా మారింది.
Also Read
- Akhil Akkineni : పవన్ సాదినేని దర్శకత్వంలో అఖిల్ అక్కినేని?
- Mrunal Thakur and Yashasvi Jaiswal: మృణాల్ ఠాకూర్–యశస్వి జైస్వాల్ డేటింగ్..! వైరల్ వీడియోతో మొదలైన కొత్త చర్చ..
- Wedding Rumours: హార్దిక్ పాండ్యా రహస్యంగా పెళ్లి చేసుకున్నాడా? వైరల్ ఫోటోపై నిజమేంటి?
- Ranabaali : 'రణబాలి' వివాదంపై మైత్రి రవిశంకర్ స్పందన.. విజయ్‌పై కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
New World Map: ‘తప్పుగా చూపితే అంగీకరించం’.. కొత్త ‘‘వరల్డ్ మ్యాప్’’పై భారత్ ఘాటు స్పష్టీకరణ
-
KCR : అసెంబ్లీలో కేసీఆర్ బిగ్ ప్లాన్.. ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు.!
-
TFPC: హోరాహోరీగా ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికలు.. గెలిచింది ఎవరెవరు అంటే ?
-
Fire Accident: ఆటోనగర్‌లోని హ్యుందాయ్ కార్ల షోరూమ్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు..
-
Vikarabad Land Fraud : 2 ఎకరాలు రాసిస్తే.. మొత్తం భూమినే కొట్టేశాడు.. అల్లుడి మాస్టర్ ప్లాన్
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!