టాలీవుడ్ యాక్షన్ స్టార్ గోపీచంద్ ప్రస్తుతం ఒక సాలిడ్ హిట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. గత కొంతకాలంగా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాలు లేకపోయినా, ఈ మ్యాచో స్టార్ చేతిలో వరుస ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పటికే సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకోగా, ఇప్పుడు తన తదుపరి చిత్రం గురించి ఒక క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. డెబ్యూ డైరెక్టర్ కుమార సాయి దర్శకత్వంలో గోపీచంద్ ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌కు గతేడాది (2025) శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం గ్రాండ్‌గా లాంచ్ అయినప్పటికీ, కొన్ని అనివార్య ఆర్థిక కారణాల వల్ల షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. అయితే, తాజాగా నిర్మాతలకు ఉన్న ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయినట్లు సమాచారం.
Also Read:Moinabad Drug Case : రంగంలోకి సిట్.. నిందితుడు నమిత్ శర్మ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..
ముఖ్యంగా ఈ నిర్మాణ సంస్థ నుండి రాబోతున్న నాగచైతన్య చిత్రం ‘వృషకర్మ’ షూటింగ్ పూర్తవడంతో, మేకర్స్ ఇప్పుడు పూర్తి ఫోకస్‌ను గోపీచంద్ సినిమాపై మళ్లించారు. దీంతో నిలిచిపోయిన ఈ ప్రాజెక్ట్ మళ్ళీ పట్టాలెక్కడానికి సిద్ధమైంది. ఈ సినిమా తాజా షెడ్యూల్‌ను విదేశాల్లో ప్లాన్ చేశారు మేకర్స్. ఈ ఏడాది ఏప్రిల్ నెల నుండి లండన్‌లో దాదాపు రెండు నెలల పాటు సుదీర్ఘ షెడ్యూల్ జరగనుంది. చిత్రంలోని ప్రధాన తారాగణం అంతా ఈ షెడ్యూల్‌లో పాల్గొనబోతున్నారు. సినిమాలోని మేజర్ పార్ట్ లండన్ పరిసర ప్రాంతాల్లోనే చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఇంటర్నేషనల్ షెడ్యూల్‌తో సినిమా టాకీ పార్ట్ చాలా వరకు పూర్తవుతుంది. 2027 ప్రథమార్ధంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
