Gopichand: నన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు.. భీమాతో కేక పెట్టిస్తా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gopichand: మ్యాచో హీరో గోపీచంద్ మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్ భీమా. ఈ సినిమాకి ఎ హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె కె రాధామోహన్ లావిష్ గా నిర్మించారు. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటించారు. టీజర్ , ట్రైలర్, పాటలు ఇలా సినిమాకు సంబంధించిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మార్చి 8న మహా శివరాత్రి సందర్భంగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హన్మకొండ వరంగల్ లో మ్యాసీవ్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, పద్మశ్రీ గడ్డం సమ్మయ్య ఈ వేడుకకు అతిథులుగా హాజరయ్యారు. భారీ సంఖ్యలో అభిమానులు, ప్రేక్షకులు మధ్య ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.
ప్రీరిలీజ్ ఈవెంట్లో మ్యాచో హీరో గోపీచంద్ మాట్లాడుతూ..”చాలా రోజుల తర్వాత మీ అందరినీ చూడటం చాలా ఆనందంగా వుంది. ఇన్నేళ్ళ నుంచి నన్ను మీ గుండెల్లో పెట్టి చూసుకుంటున్న మీ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ వేడుకకు అతిథులుగా వచ్చిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారికి , పద్మశ్రీ గడ్డం సమ్మయ్య గారికి ధన్యవాదాలు. ఈ సినిమా మొదలుకావడానికి కారణం మా కో ప్రొడ్యూసర్ శ్రీధర్ గారు. ఆయనే హర్ష ని పరిచయం చేశారు. భీమా అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది. ప్రతి సీన్ చాలా బావుటుంది. నేను సాధారణంగా ఇలా చెప్పాను… కానీ ఈ సినిమా కేక పుట్టిస్తుంది. అందులో సందేహం లేదు. ఇంత బాగా సపోర్ట్ చేసిన నిర్మాత రాధమోహన్ గారికి ధన్యవాదాలు. సినిమా ఇంత బాగా రావడానికి కారణం ఆయనే. చాలా గ్రాండ్ గా నిర్మించారు. కో స్టార్స్ మాళవిక, ప్రియ, ఈ సినిమాలో నటించిన అందరికీ ధన్యవాదాలు. మా మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. సినిమా వేరే లెవల్ లో కొట్టాడు. రామ్ లక్ష్మణ్, వెంకట్, రవి వర్మ చాలా ఎక్స్ ట్రార్డినరీ ఫైట్ సీక్వెన్స్ ఇచ్చారు. ఇంటర్వెల్, క్లైమాక్స్ ఫైట్స్ గొప్పగా అలరిస్తాయి. అజ్జు చాలా పవర్ ఫుల్ డైలాగ్స్ రాశాడు. తను చాలా మంచి రైటర్ అవుతాడు. ఈ సినిమాలో పని చేసిన ప్రతి టెక్నిషియన్ కి థాంక్స్. ఈ వేడుకకు సహకరించిన పోలీసులకు, కాలేజ్ యాజమాన్యానికి అందరికీ ధన్యవాదాలు” తెలిపారు.
Also Read
- Ramayana : బ్రహ్మ ముహూర్తాన ట్రైలర్.. గురువారం తెల్లవారుజామునే మోగనున్న రికార్డుల మోత!
- Pavala Shyamala: శ్యామల ఎలా 'పావలా శ్యామల' అయ్యారు? చాలా మందికి తెలియని నిజం!
- Allu Arjun: అభిమానుల కోసం బన్నీ స్పెషల్ గిఫ్ట్.. 900 మందికి ఊహించని సర్ప్రైజ్!
- MM Keeravani: బాబు సినిమా కోసం ఇంత టైమ్ ఎందుకు స్వామి?.. 'వారణాసి' రీ రికార్డింగ్‌పై కీరవాణి కీలక నిర్ణయం!
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం
-
EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
-
AP Government: వారసత్వ భూములపై గుడ్‌న్యూస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Melania Trump: మెలానియా ట్రంప్‌కు హత్యా బెదిరింపులు.. ఇరాన్ వీడియో కలకలం
-
Off The Record: మంత్రులకు ఎమ్మెల్యేల షాక్? చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఆధిపత్య పోరు
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్‌తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్‌కు మరకలా..? ఈ ట్రిక్‌తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!