మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్స్ స్పెషలిస్ట్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం నిన్న ఉదయం ప్రారంభమైంది. ఈ చిత్రం బాలయ్య 107వ ప్రాజెక్ట్. గోపీచంద్ బాలయ్యతో కలిసి పని చేయడం కూడా ఇదే మొదటిసారి. ఈ ప్రత్యేకమైన రోజున గోపీచంద్ ట్విట్టర్‌లో ఎమోషనల్ ట్వీట్ చేశారు.
Read Also : భారీ ధరకు “సర్కారు వారి పాట” ఓవర్సీస్ రైట్స్
“చిన్నప్పుడు నేను చొక్కాలు చించుకుని ఒక్క సారైనా కలవాలని కలలు కన్న నా హీరో. ఇండస్ట్రీకి వచ్చాక ఎలాగైనా ఆయన్ని డైరెక్ట్ చెయ్యాలని టార్గెట్ పెట్టుకున్న నా అభిమాన మాస్ హీరో. నా బాలయ్యతో పని చేసే భాగ్యం కలగడం నా లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ కంటే బాలయ్యకు దర్శకత్వం వహించే అవకాశాన్ని జీవితకాల బాధ్యతగా భావిస్తున్నాను. జై బాలయ్య” అంటూ ట్వీట్ చేశారు. ఈ సినిమాకు ‘జై బాలయ్య’ అనే టైటిల్ ను అనుకుంటుంన్నారని టాక్. అలాగే శృతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై “ఎన్‌బికె 107” చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం డైరెక్టర్ గోపీచంద్ చాలా రీసెర్చ్ చేశారు.
