NTV Telugu Site icon

Gopichand: ఆయన గొప్పోడు.. నువ్వేం పీకావ్.. హీరోకు డైరెక్టర్ సూటి ప్రశ్న

Teja

Teja

Gopichand: మ్యాచో హీరో గోపీచంద్ కొన్నేళ్లుగా సక్సెస్ కోసం బాగా కష్టపడుతున్నాడు.విభిన్నమైన కథలను ఎంచుకోవడంలో గోపీచంద్ ఏరోజు ప్రేక్షకులను డిజప్పాయింట్ చేయలేదు. కానీ, వేరే వేరే కారణాల వలన గోపీచంద్ కు విజయాలు అందలేదు. ఇకపట్టువదలని విక్రమార్కుడులా గోపీచంద్ హిట్ కోసం కష్టపడుతూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే తన కెరీర్ లో రెండు హిట్లు ఇచ్చిన శ్రీవాస్ తో హ్యాట్రిక్ కొట్టడానికి రామబాణంతో రానున్నాడు. మే 5 న ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై ఆసక్తిని కూడా పెంచేసాయి. ఇక ఎప్పుడు రిజర్వడ్ గా కామ్ గా ఉండే గోపీచంద్ ట్రెండ్ కు తగ్గట్టు.. ప్రమోషన్స్ లో యమా యాక్టివ్ గా ఉంటున్నాడు. నిన్నటికి నిన్న సుమ షోలో సుమకి పంచ్ లు వేసి షాక్ ఇచ్చిన గోపీచంద్ .. తాజాగా డేరింగ్ డైరెక్టర్ తేజతో డేరింగ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.

Akhil Akkineni: ‘ఏజెంట్’కు ‘పఠాన్’కు పోలిక లేదు: డినో మోరియా

డైరెక్టర్ తేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాటిట్యూడ్, పొగరు, కోపం అన్ని కలిపినా డైరెక్టర్ తేజ అని, నటీనటులు మంచిగా చేయకపోతే నిర్మొహమాటంగా చెంపపై కొట్టి మరీ చేయిస్తాడని టాక్ ఉంది. గోపీచంద్ కూడా తేజ స్టూడెంటే అని చెప్పొచ్చు. అదేనండీ .. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన జయం సినిమాలో విలన్ గా నటించడంతోనే గోపీచంద్ దశ మొదలయ్యింది. ఇక తేజ ఇంటర్వ్యూలు చూస్తే .. ఎవరిని కావాలని పొగడడు, తన మనసుకు ఏది అనిపిస్తే అది చెప్తాడు. సమాజంలో నిజాలు మాట్లాడతాడు. తాజాగా గోపీచంద్ తో కూడా అలంటి నిజాలను బయట పెట్టించాడు. ఈ ఇంటర్వ్యూకు సంబందించిన ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.

Alia Bhatt: అలియా కొత్త ఇల్లు.. అన్ని కోట్లా..?

” ఈ సినిమా పేరు రామబాణం.. బాలకృష్ణ అనౌన్స్ చేయించారు.. ఆయనతో ఎందుకు అనౌన్స్ చేయించారు” అనే ప్రశ్నతో ఈ ప్రోమో మొదలయ్యింది. తేజ సూటి ప్రశ్నలకు గోపీచంద్ ఎంతో కూల్ గా సమాధానాలు చెప్పి శభాష్ అనిపించాడు. శ్రీవాస్ కు నీకు గొడవలంట గా అని బాంబ్ పేల్చాడు.. ఆ తరువాత తనదైన శైలిలో ప్రశ్నల వర్షం కురిపించాడు. ” నాతో సినిమా ఒప్పుకున్నావ్.. హీరోయిన్ సెట్ అవ్వలేదు.. ఆమెను సెట్ చేద్దాం అనుకొనేలోపు నన్ను పక్కకు పెట్టి వేరేవారితో సినిమా ఓకే చేశావ్.. కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు” అంటూ గోపీచంద్ ను అడిగేశాడు. దానికి గోపిచంద్ నేను చేసింది తప్పే అని ఒప్పుకొని వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక గోపీచంద్ సైతం తేజను సూటిగా ఒక ప్రశ్న అడిగాడు. ” మీరెందుకు సినిమాలకు ఇంత గ్యాప్ ఇస్తున్నారు” అన్న ప్రశ్నకు తేజ సమాధానమిస్తూ.. ” నేను వెళ్లి ఇంతవరకు మీతో సినిమా చేస్తాను అని అడగను” చెప్పుకొచ్చాడు. ఇక గోపీచంద్ నాన్నగారు చేసిన మంచి పనివలనే జయం సినిమాలో ఆయనకు ఆఫర్ వచ్చింది అన్న తేజ .. తన ఉద్దేశ్యంలో గోపీచంద్ ఇంకా అలాంటి ఫౌండేషన్ వేయలేదని, మీ నాన్న గొప్పోడు ఓకే .. నువ్వేం పీకావ్ అంటూ గోపిచంద్ ముఖం మీదనే అడిగేశాడు. ఇక దీనికి గోపీచంద్ ఏం సమాధానం చెప్పాడో తెలుసుకోవాలంటే రేపు రిలీజ్ కానున్న ఫుల్ ఇంటర్వ్యూ చూడాల్సిందే. ఇక ఈ ప్రోమో చూసాక.. ఇలాంటి నిజాయితీగల ఇంటర్వ్యూ ఎప్పుడు చూడలేదని అభిమానులు చెప్పుకొస్తున్నారు.