Google Search: ఈరోజుల్లో ఏం అవసరం ఉన్నా గూగుల్‌లో వెతికితే పని సులభంగా అయిపోతోంది. దీంతో అందరూ గూగుల్‌పై తెగ ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది గూగుల్ మోస్ట్ సెర్చ్‌డ్ ఏషియన్ జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో టాప్-5లో ముగ్గురు భారతీయులు ఉన్నారు. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టాప్-3లో ఉన్నాడు. ఆ తర్వాత బాలీవుడ్ హీరోయిన్‌లు కత్రినా కైఫ్ నాలుగో స్థానంలో, ఆలియా భట్ ఐదో స్థానంలో నిలిచారు. నాలుగు పదుల వయసుకు దగ్గరలో ఉన్నా కుర్ర హీరోలను కాదని కత్రినా కైఫ్ నాలుగో స్థానం సంపాదించడం విశేషం. ఈ లిస్టులో సౌత్ కొరియా బ్యాండ్ బీటీఎస్ సభ్యులు తేయుంగ్, జంగ్ కుక్ తొలి రెండు స్థానాలను దక్కించుకున్నారు.
Read Also: Aishwarya: ముగ్గురు పిల్లలకు తల్లి కాబోతున్న ఐశ్వర్య
అన్ని రంగాల నుంచి గూగుల్ మోస్ట్ సెర్చ్ డ్ లిస్ట్ తీస్తే.. ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి మాత్రం కత్రినాకైఫ్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. బాలీవుడ్‌లో యంగ్ స్టార్స్ చాలా మంది ఉన్నారు. పాపులర్ స్టార్స్ ఉన్నారు. సౌత్ నుంచి పాన్ ఇండియా స్టార్లు కూడా ఉన్నారు. బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ సినిమాలతో ప్రభాస్, ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు. ఇంత మంద ఉన్నా టాప్-5లో కత్రినా స్థానం దక్కించుకోవడం విశేషం. ఆకట్టుకునే అందం, అభినయంతో పాటు యూత్‌ను అట్రాక్ట్ చేసే హాట్ నెస్ కారణంగా ఇప్పటి యంగ్ స్టార్స్‌లో కూడా కత్రినాకైఫ్ తిరుగులేని ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.
