‘గుడ్ లక్ సఖి’ సైతం వెనక్కి వెళ్ళింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ రజనీకాంత్ ‘పెద్దన్న’ చిత్రంలో ఆయన చెల్లిగా కీలక పాత్ర పోషించింది జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేశ్. ఆ సినిమా నవంబర్ 4వ తేదీ విడుదల కాగా, ఆమె టైటిల్ రోల్ పోషించిన ‘గుడ్ లక్ సఖి’ చిత్రం 26న విడుదల కావాల్సి ఉంది. కానీ ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ విడుదల చేయాలని భావించిన నిర్మాతలు ఇప్పుడు కాస్తంత వెనక్కి వెళ్ళారు.
ఈ విషయాన్ని చిత్ర నిర్మాత సుధీర్ చంద్ర తెలియచేస్తూ, ”పలు కారణాల వల్ల ఈ సినిమా విడుదలను వాయిదా వేశాం. మరికొన్ని సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి, థియేటర్ల సమస్య ఏర్పడకుండా ఉండేందుకు, భారీ ఎత్తున ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఇలా అన్ని కోణాల్లో ఆలోచించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. అన్ని విధాలుగా మాకు డిసెంబర్ 10 సరైన తేదీ అనుకున్నాం. ఈ సినిమా విజయంపై మాకు నమ్మకం ఉంది. ప్రేక్షకులందరికీ అద్భుతమైన అనుభూతిని ఈ మూవీ ఇస్తుందని నమ్ముతున్నాం” అని తెలిపారు. నగేశ్ కుకునూర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. సహ నిర్మాత శ్రావ్య వర్మ నేతృత్వంలో ఎక్కువ మంది మహిళా సభ్యులతో ఈ చిత్రం రూపుదిద్దుకోవడం విశేషం. ఇదిలా ఉంటే డిసెంబర్ 2న బాలకృష్ణ ‘అఖండ’ విడుదల కాబోతున్న నేపథ్యంలో వరుణ్ తేజ్ ‘గని’ చిత్రం డిసెంబర్ 3 నుండి డిసెంబర్ 24కు వాయిదా పడిన విషయం తెలిసిందే!
Also Read
- Pooja Hegde : 18 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే ఇలా ఉందేంటి
- Ajith Kumar: 'డేర్‌డెవిల్'గా దూసుకొస్తున్న అజిత్.. మళ్లీ అధిక్ రవిచంద్రన్‌తో చేతులు కలిపిన స్టార్ హీరో!
- Sukumar - DSP: దేవిశ్రీ ప్రసాద్ - సుకుమార్‌ల బంధానికి బ్రేక్ పడిందా? RC17 నుంచి DSP అవుట్!
- Rashmika Mandanna: గాయాలపై రష్మిక ఎమోషనల్ పోస్ట్.. అసలు ఏం జరిగిందో చెప్పిన స్టార్ హీరోయిన్!
తాజావార్తలు
-
Pooja Hegde : 18 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే ఇలా ఉందేంటి
-
Daily Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త, లేదంటే మూల్యం చెల్లించక తప్పదు!
-
Ajith Kumar: ‘డేర్‌డెవిల్’గా దూసుకొస్తున్న అజిత్.. మళ్లీ అధిక్ రవిచంద్రన్‌తో చేతులు కలిపిన స్టార్ హీరో!
-
Off The Record: వైసీపీ DSC పోరాటం.. కూటమి ప్రభుత్వానికి కొత్త టెన్షన్..!!
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం.. ట్రాఫిక్ టోటల్ జామ్..!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఉల్లి-ఆలూ తాజాగా ఉండాలంటే.? ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి.!
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్‌తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్‌గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!