Good Bad Ugly : తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ కు భారీ ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి అజిత్ కేవలం తన ఫ్యాన్స్ కోసమే చేసిన లేటెస్ట్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ. తెలుగు బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో అధిక్ కుమార్ డైరెక్షన్ లో వచ్చింది ఈ సినిమా. త్రిష, శ్రీలీల హీరోయిన్లుగా నటించారు. ఏప్రిల్ 10న రిలీజైన ఈ సినిమా తెలుగులో పెద్దగా ఆదరణ దక్కించుకోలేకపోయింది. కానీ తమిళంలో మాత్రం మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ ఫస్ట్ రోజు కలెక్షన్ల గురించి తాజాగా ప్రకటించారు.
Read Also : New Tatkal Timings: రేల్వే ప్రయాణికులకు అలెర్ట్.. తత్కాల్ బుకింగ్ సమయాల్లో మార్పులు
మొదటి రోజు తమిళంలో రూ.30.9 కోట్లు వసూలు చేసింది ఈ సినిమా. ఇది ఇప్పటి వరకు అజిత్ కెరీర్ లోనే తమిళంలో హయ్యెస్ట్ వసూళ్లు. దీంతో అజిత్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం తమిళంలో ఈ మూవీ సక్సెస్ ఫుల్ గానే రన్ అవుతోంది. ఇటు తెలుగులో పెద్దగా ఆదరణ దక్కట్లేదు ఈ సినిమాకు. తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో దీన్ని రిలీజ్ చేసింది. పెద్ద సినిమాలు కూడా పోటీ లేవు కాబట్టి.. కలెక్షన్లకు ఇప్పట్లో పర్వాలేదు అని అంటున్నారు.