ఓటీటీలో కొత్తగా తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమాకు మంచి క్రేజ్ ఏర్పడింది. తమిళ్ సినిమా “ఇరైవన్”ను తెలుగులో “గాడ్” టైటిల్‌తో ఓటీటీ ప్రీమియర్ చేసారు. ఈ సినిమాలో జయం రవి, నయనతార జంటగా, రాహుల్ బోస్ విలన్‌గా నటించారు. దర్శకుడు ఐ. అహ్మద్ ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది.
Also Read : Samantha : ప్రేమ -పెళ్లి తొందరపడ్డ.. సమంత ఎమోషనల్ పోస్ట్
ఈ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ కథలో ఏసీపీ అర్జున్ (జయం రవి) చట్టాన్ని మించిపోతే తప్పు అని నమ్మే పోలీస్. సిటీ లో “స్మైలీ కిల్లర్” బ్రహ్మ (రాహుల్ బోస్), అమ్మాయిల అవయవాలను తీసేసి నగ్నంగా బయటపడేస్తుంటాడు బ్రహ్మ అలియాస్ స్మైలీ కిల్లర్ (రాహుల్ బోస్).. అర్జున్, అతని స్నేహితుడు ఆండ్రూ బ్రహ్మను పట్టుకోడానికి ప్రయత్నిస్తారు. చివర్లో జరిగే ట్విస్టులు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, రక్తపాతం, మిస్టరీ, సస్పెన్స్ప్రే క్షకులను ఎడ్జ్ లో కూర్చోబెడతాయి. కాగా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళ భాషలలో “గాడ్” మరియు “ఇరైవన్” పేర్లతో స్ట్రీమింగ్ అందుబాటులో ఉంది. థ్రిల్లింగ్, మిస్టరీ సినిమాల అభిమానులకు ఇది ఫుల్ మీల్స్ అని చెప్పవచ్చు.