RC 17: పుట్టిన రోజుకు ముందే పండుగ మొదలెట్టండి.. రికార్డుల వేటకు రంగస్థలం కాంబో రిపీట్!

Rc17 Is All Set To Add New Colours To The Indian cinema

Rc17 Is All Set To Add New Colours To The Indian cinema

RC 17 Movie with Sukumar Announced: జరుగుతున్న ప్రచారమే నిజమైంది. చాలా కాలం నుంచి రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. రామ్ చరణ్ పుట్టినరోజుకు సరిగ్గా రెండు రోజుల ముందు ఈ విషయాన్ని ఖరారు చేస్తూ అధికారికంగా ప్రకటన వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఒక సినిమా తెరకెక్కిస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించబోతున్నట్లు కూడా అధికారికంగా ప్రకటన చేశారు. గుర్రాలు రేసుకు సిద్ధమవుతున్నట్లుగా ఉన్న ఒక ఫోటోని సైతం ఈ సందర్భంగా సినిమా యూనిట్ షేర్ చేసింది.

GOG : మోత మోగించేస్తున్న అయేషా ఖాన్ స్పెషల్ సాంగ్.. చూశారా?

మైత్రి మూవీ మేకర్స్ తో పాటు సుకుమార్ రైటింగ్స్ సహా నిర్మించబోతుందని క్లారిటీ వచ్చేసింది. రేరింగ్ టు కాంక్వర్-అంటే ఆక్రమించడానికి రంగంలోకి దిగుతున్నాం అంటూ ప్రకటించారు. ట్రిపుల్ ఆర్ త‌ర్వాత గ్లోబ‌ల్ ఐకాన్‌గా గుర్తింపు పొందారు రామ్‌చ‌ర‌ణ్‌. ఇటు పుష్ప సినిమాతో త‌గ్గేదేలే అంటూ అంద‌రివాడ‌నిపించుకున్నారు మూవీ మాస్ట‌ర్ సుకుమార్‌. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌నున్న ఈ సినిమా మీద మ‌న ద‌గ్గ‌రే కాదు, దేశ వ్యాప్తంగా, ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎక్స్ పెక్టేష‌న్స్ ఉన్నాయి. వాట‌న్నిటినీ అందుకునేలా చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు సుకుమార్‌. ఈ ఏడాదిలోనే షూటింగ్ మొద‌లుపెడ‌తారు. 2025 లాస్ట్ క్వార్ట‌ర్‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. రంగస్థలం బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రామ్ చరణ్, సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్, డీఎస్పీ కాంబినేషన్‌లో రెండో సినిమా ఇది. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా అలరించనుంది.

ప్రస్తుతానికి రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజెర్ అనే సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని దిల్ రాజు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా మొన్న సంక్రాంతికే విడుదల కావాల్సి ఉంది కానీ పలు కారణాలతో సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఇక ఈ సినిమాని సెప్టెంబర్ నెలలో రిలీజ్ చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మరోపక్క రాంచరణ్ 16వ సినిమా కూడా ఈ మధ్యనే ఘనంగా ప్రారంభమైంది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాల్లో శివ రాజ్ కుమార్ సంజయ్ దత్ వంటి హేమా హేమీలు నటిస్తున్నారు.