యంగ్ హీరో సంతోష్ శోభన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాల్లో “ప్రేమ్ కుమార్” ఒకటి. ఈ చిత్రానికి దర్శకుడు అభిషేక్ మహర్షి దర్శకత్వం వహించారు. శివ ప్రసాద్ పన్నీరు నిర్మించారు. అనంత శ్రీకర్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.”ప్రేమ్ కుమార్” గ్లింప్స్ వీడియో ఈ రోజు ఉదయం విడుదల చేశారు మేకర్స్. ప్రధాన పాత్రలను పరిచయం చేసిన ఈ వీడియో కేజ్రీగా సాగింది. హీరో రొమాన్స్, ప్రేమ్ కుమార్ వివాహానికి దారితీసే ఉల్లాసకరమైన సంఘటనలు ఎంటర్టైనింగ్ గా ఉన్నాయి. యంగ్ బ్యూటీ రాశి సింగ్ ఈ చిత్రంతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా నటిస్తోంది.
Read Also : సామ్ విషయంలో నాగ్ మౌనం… కారణం?
అతను వర్షం సినిమా దర్శకుడు శోభన్ కుమారుడు సంతోష్ శోభన్. అతను తెలుగు చిత్రం ” గోల్కొండ హై స్కూల్ ” కోసం చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. తరువాత అవికా గోర్ తో కలిసి ) సరసన “తను నేను”, 2018లో “పేపర్ బాయ్” చిత్రాల్లో నటించాడు. అయితే ఆ రెండు సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు. కానీ ఆయన మూడవ చిత్రం “ఏక్ మినీ కథ” చిత్రం ఇటీవల విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఆ తరువాత ఈ హీరో ఫుల్ జోష్ లో వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇప్పడు ఆయన ఖాతాలో మారుతీ దర్శకత్వంలో “మంచి రోజులు వచ్చాయి” మూవీ, “ప్రేమ్ కుమార్” ఉన్నాయి.