Ghattamaneni Fans: మే 31న మొట్టమొదటి ఇండియన్ కౌబాయ్ సినిమా రీరిలీజ్

Ghattamaneni

Ghattamaneni

తెలుగు సినిమాకి టెక్నికల్  హంగులు అద్దిన వాడు, లెక్కలేనన్ని ప్రయోగాలు చేసిన వాడు సూపర్ స్టార్ కృష్ణ. ఈస్టమన్ కలర్ నుంచి మొదటి 70MM సినిమా వరకూ చెయ్యాల్సిన ఎక్స్పరిమెంట్స్ అన్నీ చేసిన కృష్ణ, ఇండియన్ సినిమా చూసిన లెజెండ్స్ లో ఒకరు. అందుకే ప్రతి సంవత్సరం కృష్ణ పుట్టిన రోజుని ఫాన్స్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా కృష్ణ అభిమానులు సంబరాలకి సిద్ధమయ్యారు కానీ అప్పటికీ ఇప్పటికీ ఉన్న ఒకేఒక్క తేడా కృష్ణ లేకపోవడమే. మరణించినా మన మధ్యే ఉండే కృష్ణకి ట్రిబ్యూట్ ఇస్తూ మే 31న ‘భారతీయ చిత్ర పరిశ్రమలో వచ్చిన మొట్టమొదటి కౌ బాయ్’ సినిమా అయిన ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమాని 4K వెర్షన్ లో రీరిలీజ్ చేస్తున్నారు. కృష్ణ, విజయ నిర్మల, గుమ్మడి, కైకాల సత్యనారాయణ, నాగ భూషణం, జ్యోతి లక్ష్మీ లాంటి లెజెండ్స్ నటించిన ఈ మూవీని లెజెండరీ ‘కేఎస్ఆర్ దాస్’ తెరకెక్కించారు.

పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ పై స్వయంగా మోసగాళ్లకు మోసగాడు సినిమాని ప్రొడ్యూస్ చేశారు ఘట్టమనేని ఆదిశేషగిరి రావు. హాలీవుడ్ లోని “For a Few Dollars More; The Good, the Bad and the Ugly; Mackenna’s Gold లాంటి సినిమాలని చూసి ఇన్స్పైర్ అయ్యి మోసగాళ్లకు మోసగాడు సినిమాని రూపొందించారు. అత్యధిక బడ్జట్ తో రూపొంది 1971లో రిలీజ్ అయిన ఈ సినిమాని అప్పట్లోనే తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో కూడా డబ్ చేసి రిలీజ్ చెయ్యడం విశేషం. ఈ జనరేషన్ ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడే లార్జర్ దెన్ లైఫ్ కథ, కథనం, మేకింగ్ స్టాండర్డ్స్ ఉన్న మోసగాళ్లకు మోసగాడు సినిమాతో కృష్ణని గుర్తు చేసుకుంటూ ఘట్టమనేని అభిమానులు థియేటర్స్ కి వెళ్లనున్నారు.