Site icon NTV Telugu

Ghani : ట్రైలర్ కు ముహూర్తం ఖరారు

Ghani

Ghani

Ghani ట్రైలర్ రిలీజ్ డేట్ ను తాజాగా మేకర్స్ ప్రకటించారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘గని’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ‘గని’లో ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతి బాబు, సాయి మంజ్రేకర్ వంటి నటినటులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించి ఇప్పటికే హైప్‌ని సృష్టించాడు. ఈ స్పోర్ట్స్ డ్రామాలో వరుణ్ బాక్సర్‌గా నటిస్తున్నాడు. రెనైసాన్స్ పిక్చర్స్, అల్లు బాబీ కంపెనీ బ్యానర్‌లపై సిద్ధు ముద్దా, అల్లు బాబీ నిర్మించారు. అల్లు అరవింద్ సమర్పణలో ‘గని’ తెరకెక్కుతోంది. సంగీతం తమన్ అందించారు. ఈ సినిమా టీజర్ భారీ ఇంపాక్ట్ క్రియేట్ చేసి సినిమాపై అంచనాలను పెంచేసింది.

Read Also : Ashoka Vanam Lo Arjuna Kalyanam : రిలీజ్ డేట్ ఫిక్స్

ఇక మేకర్స్ ఇచ్చిన తాజా అప్డేట్ ప్రకారం “గని” టీజర్ మార్చ్ 17న ఉదయం 10 గంటల 30 నిమిషాలకు విడుదల కానుంది. తాజా అప్డేట్ తో మెగా ఫ్యాన్స్ ఇప్పుడు “గని” ట్రైలర్ గురించి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక సినిమా ఏప్రిల్ 8న రానున్న విషయం తెలిసిందే. పలు వాయిదాల అనంతరం ఈ సినిమా ఏప్రిల్ లో విడుదలకు సిద్ధమైంది.

Exit mobile version