NTV Telugu Site icon

Ante Sundaraniki: మరో రెండు భాషల్లో కూడా.. సర్‌ప్రైజ్ లోడింగ్

Ante Sundaraniki

Ante Sundaraniki

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం చేస్తున్న కామెడీ ఎంటర్టైనర్ “అంటే సుందరానికి”. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ లో నాని సరసన మలయాళ భామ నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే టీజర్ తో అందరి దృష్టిని ఆకట్టుకున్న “అంటే సుందరానికి” మూవీ జూన్ 10న థియేటర్లలోకి రానుంది. అయితే ఈ చిత్రాన్ని మరో రెండు భాషల్లో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు తాజాగా ఓ పోస్టర్ ను విడుదల చేసిన “అంటే సుందరానికి” టీం ఏప్రిల్ 18న స్పెషల్ అనౌన్స్మెంట్ ఉండబోతోందని ప్రకటించింది.

Read Also : R Madhavan : స్విమ్మింగ్ లో సిల్వర్… అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన తనయుడు

“అంటే సుందరానికి” సినిమాను తమిళంలో “Adade Sundara”, మలయాళంలో “Aha Sundara” అనే టైటిల్స్ తో విడుదల చేయబోతున్నారు. మరి హిందీ, కన్నడ భాషల్లో సినిమాను విడుదల చేస్తారా ? లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. ఏప్రిల్ 18న ఉదయం 11 గంటలకు వచ్చే మరో అనౌన్స్మెంట్ లో ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈరోజు ఈస్టర్ సందర్భంగా “అంటే సుందరానికి” టీం నుంచి ఈ స్పెషల్ అనౌన్స్మెంట్ వచ్చింది.