Site icon NTV Telugu

భర్త కన్నుకప్పి కజిన్ ప్రియుడితో రొమాన్స్ చేస్తున్న దీపికా పదుకొణె

gehraiyaan

gehraiyaan

బాలీవుడ్ బ్యూటీలు దీపికా పదుకొణె, అనన్య పాండే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘గెహ్రైయాన్’. శకున్ బత్రా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కరోనా కారణంగా థియేటర్లో వాయిదా పడడంతో చివరకు ఓటిటీ బాట పట్టింది. వాయ్ కామ్ 18 స్టూడియోస్ మరియు ధర్మ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 11న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది.

నిత్యం పనిలో బిజీగా ఉంటూ భార్యను పట్టించుకోని ఒక భర్త. భర్త ప్రేమకోసం ఆరాటపడే భార్య దీపికాకు, కజిన్ అనన్య తనకు కాబోయే భర్త సిద్ధాంత్ ను పరిచయం చేస్తుంది. అయితే అనన్య తన ఫియాన్సీ సిద్ధాంత్ ను దీపికా కు పరిచయం చేసిన తర్వాత అతడు దీపికాను ఇష్టపడతాడు. భర్త నుంచి దొరకని ప్రేమ సిద్ధాంత్ నుంచి దొరకడంతో దీపికా కూడా అతడితో ప్రేమలో పడి శారీరక కోరికలు తీర్చుకోవడం వరకు వెళ్తోంది. ఆ తరువాత వారి ఇద్దరి రిలేషన్ గురించి అనన్యకు, దీపికా భర్తకు తెలియడం, ఆ తరువాత వారు ఎదుర్కున్న పరిస్థితులు ఏంటి..? చివరికి ఆ ప్రేమ జంటలు ఏం అయ్యాయి..? అనేది కథగా చూపించారు. నలుగురు వ్యక్తుల మధ్య ఉన్న విచిత్రమైన బంధాలను చాలా సున్నితంగా చూపించారు. ఇక దీపికా, సిద్ధాంత్ మధ్య హాట్ లిప్ కిస్ లు వేడి పెంచుతున్నాయి. పెళ్లి తరువాత దీపికా ఇంత బోల్డ్ గా నటించడం ఇదే మొదటిసారి.. మరి అమ్మడి హాట్ సీన్స్ తో ఈ సినిమా ఎలాంటి విజయం అందుకుతుందో చూడాలి.

Exit mobile version