NTV Telugu Site icon

Geetha Madhuri: హాట్ లుక్ లో సింగర్ గీతా మాధురి.. హీరోయిన్ గా ఏమైనా ట్రై చేస్తున్నావా.. ?

Geetha

Geetha

Geetha Madhuri: సింగర్ గీతా మాధురి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో హస్కీ వాయిస్ తో మెస్మరైజ్ చేసే సింగర్ ఎవరు అంటే టక్కున గీతా గుర్తొచ్చేస్తుంది. ముఖ్యంగా ఐటెం సాంగ్స్ లో ఆమె వాయిస్ కు ఫిదా అవ్వని వారుండరు. చమ్కా..చమ్కా..చమ్కీరే అన్నా.. మగాళ్లు ఉట్టి మాయగాళ్లే అన్నా.. నేను పక్కా లోకల్ అన్నా.. గీతా వాయిస్ ను ఇట్టే గుర్తుపట్టేస్తారు అభిమానులు. ఇక సింగర్ గా బిజీ బిజీగా ఉన్నప్పుడే బిగ్ బాస్ లో అడుగుపెట్టి తనదైన ఆటతో అభిమానులను సంపాదించుకుంది. ఇక నటుడు నందును ప్రేమించి పెళ్లాడింది గీతా. వీరికి దాక్షాయణి ప్రకృతి అనే పాప కూడా ఉంది. ఒకపక్క నందు హీరోగా, క్రికెట్ కామెంటర్ గా కెరీర్ ను నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంకోపక్క గీతా.. షోస్, సినిమాలతో బిజీగా మారింది. ఇక నిత్యం గీతా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు దగ్గరగా ఉంటూ ఉంటుంది. భర్త నందు, కూతురుతో కలిసి ఉన్న ఫోటోలను, వీడియోలను అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది.

Chandramukhi 2: కంగనా అందం, అభినయం అదిరిందయ్యా

ఇక తాజాగా గీతా మాధురి కొత్త ఫోటోషూట్ ను అభిమానులతో షేర్ చేసుకుంది. వైట్ అండ్ వైట్ ట్రాన్స్పరెంట్ డ్రెస్ తో అందంగా కనిపించింది. లోపల ఎల్లో కలర్ స్లీవ్స్ టాప్ వేసుకొని పైన వైట్ అండ్ వైట్ ట్రాన్స్పరెంట్ కుర్తా వేసుకొని.. మోడల్ గా ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలను చూసిన అభిమానులు.. వావ్.. గీతా.. చాలా హాట్ గా కనిపిస్తున్నావు.. హీరోయిన్ గా ఏమైనా ట్రై చేస్తున్నావా.. ? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి గీత మాధురి ఏదైనా షో కోసం ఈ ఫోటోషూట్ చేసిందా.. ? లేక మరింకేదైనా ప్రోగ్రాం కోసం చేసిందా.. ? అనేది తెలియాల్సి ఉంది.