NTV Telugu Site icon

Bigg Boss Telugu 7: హ్యాట్సాఫ్ గౌతమ్..ఆ ఒక్క నిర్ణయంతో వాళ్లందరికీ నచ్చేశావ్ పో!

Bb Gautham Krishna

Bb Gautham Krishna

Gautham Krishna Record Breaking Decision about female Contestants: తెలుగులో బిగ్ బాస్ సూపర్ సక్సెస్ అయిన ఈ షో అని తెలిసిందే, ఆ షో ఇప్పుడు ఏడో సీజన్‌ను జరుపుకుంటోంది. ఇందులో ఎన్నో ఊహించని పరిణామాలు జరుగుతున్నా కొన్ని మాత్రం ఆసక్తికరంగా సాగుతోంది. అందుకు తగ్గట్లుగానే తాజాగా కెప్టెన్ గౌతమ్ కృష్ణ బిగ్ బాస్ చరిత్రలోనే ఏ కంటెస్టెంట్ చేయని విధంగా ఓ గొప్ప నిర్ణయం తీసుకుని హాట్ టాపిక్ అయ్యారు. అసలేమంటే గౌతమ్ కృష్ణ మొదటి నుంచే అందరి దృష్టినీ ఆకర్షించి హైలైట్ అయ్యాడు. ఫిజికల్, మెంటల్ టాస్కులను దిగ్విజయంగా పూర్తి చేస్తూ సత్తా చాటుతున్న గౌతమ్ మధ్యలో బిగ్ బాస్ నిర్ణయంలో భాగంగా సీక్రెట్ రూమ్‌కు వెళ్లొచ్చాడు. ఆ తర్వాత నుంచి అశ్వద్దామాగా తనలోని 2.O వెర్షన్‌ను చూపిస్తూ మరింత స్ట్రాంగ్‌గా, మెచ్యూరిటీతో కనిపిస్తూ ఫాలోయింగ్‌ను పెంచుకుంటున్నాడు.

Balayya : రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన బాలయ్య..?

గౌతమ్ కృష్ణ ఇంటి సభ్యులు అందరి మద్దతును కూడగట్టుకుని కెప్టెన్‌గా ఎంపిక అయ్యి కొన్ని ఊహించని గొప్ప నిర్ణయాలు తీసుకుని ఔరా అంటూ ఆశ్చర్యపరుస్తున్నాడు. గౌతమ్ కృష్ణ ఈ వారం తనకు డిప్యూటీ కెప్టెన్లుగా లేడీ కంటెస్టెంట్లు రతికా రోజ్, శోభా శెట్టిని తీసుకుని ఆడవాళ్ల పట్ల తన గౌవరాన్ని చూపించుకోగా ఇప్పుడు కెప్టెన్‌గా గౌతమ్ ఎవరూ ఊహించని మరో నిర్ణయం తీసుకున్నాడు. ‘ప్రతి ఇంట్లో ఆడవాళ్లు ఎన్నో రకాల పనులు చేస్తుంటారు, ఇంటి బాధ్యతలు చూసుకోవడంలో వాళ్లదే అప్పర్ హ్యాండ్ అని చెబుతూ ప్రతి ఇంట్లో ఉన్న, ఇక్కడ ఉన్న, టీవీల్లో చూస్తున్న ఆడవాళ్లకు గౌరవంగా మన బిగ్ బాస్ హౌస్‌లో ఈ వారం ఫీమేల్ వీక్ జరుపుకుందామని ప్రతిపాదించాడు. ఇందుకోసం ఈ వారం అంతా లేడీస్‌‌కు హాలీడేస్ ఇస్తున్నా అని తెలపగా అందరూ అతని నిర్ణయాన్ని మెచ్చుకుని ఎస్ చెప్పారు. ఒకరకంగా బిగ్ బాస్ చరిత్రలోనే ఇలాంటి నిర్ణయం ఏ కంటెస్టెంట్ తీసుకోలేదని ఇలాంటి నిర్ణయం తీసుకుని గౌతమ్ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడని అంటున్నారు.

Show comments