Balayya : రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన బాలయ్య..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి నాటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు… గత ఏడాది బాలయ్య అఖండ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ విజయం అందుకున్నాడు..ఆఖండ సినిమాకి కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా వాటన్నిటిని దాటుకొని ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది.. అలాగే బాలయ్య ఈ ఏడాది ఆరంభంలో వీరసింహారెడ్డి సినిమా తో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు… గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. రీసెంట్ గా దసరా కానుకగా విడుదల అయిన భగవంత్ కేసరి సినిమా అద్భుతమైన విజయం సాధించడంతో బాలయ్య హ్యాట్రిక్ హిట్స్ సొంతం చేసుకున్నాడు.నిజానికి తన కెరీర్లో చాలా వరకూ మినిమం గ్యారెంటీ హిట్స్ అందించిన బాలయ్య..ఇప్పుడీ హ్యాట్రిక్ విజయాలతో తన రెమ్యునరేషన్ పెంచినట్లు తెలుస్తుంది.బాలకృష్ణ తాజాగా తన తర్వాతి సినిమా కోసం ఏకంగా రూ.28 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం..
బాబీ డైరెక్షన్ లో, నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా కోసం బాలయ్య తన రెమ్యునరేషన్ ఏకంగా రూ.10 కోట్లు పెంచేశాడు. తన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి కోసం ఆయన రూ.18 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నారు.. అంతకుముందు వీరసింహా రెడ్డి కోసం అందుకున్న రెమ్యునరేషన్ కంటే ఇది రూ.4 కోట్లు ఎక్కువ.ఇక అంతకుముందు హ్యాట్రిక్ విజయాల్లో మొదటిదైన అఖండ కోసం బాలయ్య రూ.10 కోట్లు రెమ్యునరేషన్ గా అందుకున్నాడని తెలుస్తుంది.. ఒక్కో సినిమా హిట్ అవుతూ వెళ్తుండటంతో అందుకు తగినట్లే బాలయ్య తన రెమ్యునరేషన్ పెంచుతూ వెళ్తున్నారు.. ప్రస్తుతం బాలకృష్ణ సినిమాలు థియేట్రికల్, నాన్ థియేట్రికల్, ఇతర ఆదాయాలతో కలిపి కనీసం రూ.150 కోట్ల బిజినెస్ చేస్తున్నాయి.. ప్రస్తుతం టాలీవుడ్ లో అధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న సీనియర్ నటుల్లో బాలయ్య రెండవ స్థానంలో వున్నారు మొదటి స్థానంలో మెగాస్టార చిరంజీవి ఉన్నాడు. చిరు ఇప్పటికీ రూ.50 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నారు.ఇక వెంకటేశ్, నాగార్జున వంటి సీనియర్ హీరోలు రూ.12 కోట్లు అందుకుంటుండగా.. మరో సీనియర్ రవితేజ రూ.24 కోట్ల వరకూ వసూలు చేస్తున్నట్లు సమాచారం…
Also Read
- Tags
- Balayya
- increased
- Remuneration
తాజావార్తలు
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Toxic Trailer: ‘‘టాక్సిక్’’ ట్రైలర్.. ఒక్క దెబ్బతో అంతా మార్చేశారు!
-
Lionel Messi: ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సీ ఇంట్లో విషాదం!
-
UPI: యూపీఐ ఛార్జీలపై కేంద్రం కీలక ప్రకటన..సామాన్యులకు ఊరట..
-
Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం? ఇరాన్లో తీవ్ర ఉత్కంఠ!
ట్రెండింగ్
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్‌ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!