Rithu Chowdary : బిగ్ బాస్ రీతూ చౌదరి వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. తన భర్త హీరో ధర్మతో రీతూ ఎఫైర్ పెట్టుకుందని గౌతమి సంచలన ఆరోపణలు చేసింది. అంతే కాకుండా రీతూ, ధర్మ ఫ్లాట్ కు అర్ధరాత్రి వస్తున్న వీడియోలను సైతం లీక్ చేసింది. 2023 నుంచే వీరిద్దరి మధ్య ఎఫైర్ మొదలైందని సంచలన కామెంట్లు చేసింది. ఈ ఆరోపణలపై ధర్మ కూడా రియాక్ట్ అయ్యాడు. తనకు ఎలాంటి ఎఫైర్లు లేవని.. తన భార్య తప్పుడు ఆరోపణలు చేస్తోందన్నాడు. కావాలంటే బెడ్ రూమ్ వీడియోలు ఉంటే బయట పెట్టాలంటూ డిమాండ్ చేశాడు. ధర్మ వ్యాఖ్యలపై తాజాగా గౌతమి రియాక్ట్ అయింది. ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో మరో షాకింగ్ కామెంట్లు చేసింది.
Read Also : Samantha : అలాంటి డ్రెస్ లో సమంత ఘాటు సోకులు
నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పటి నుంచే రీతూతో నా భర్తకు ఎఫైర్ మొదలైంది. ఆమెకు నా ఫ్లాట్ నచ్చిందంట. అందుకే నన్ను బయటకు వెళ్లగొట్టాడు. నేను గతంలో రీతూకు ఫోన్ చేసి అడిగాను.. ‘ఛీ.. ఛీ.. నేనెందుకు అలా చేస్తాను. నువ్వు తెలిసినదానివి. నాకు అలాంటి అలవాట్లు లేవు’ అంటూ బుకాయించింది. కానీ ఆమె అర్ధరాత్రి ఫ్లాట్ కు వస్తుందని తర్వాత తెలిసింది. నా భర్తను అడిగితే ఆ చుంచు ముఖం దానితో నేనెందుకు ఎఫైర్ పెట్టుకుంటాను అన్నాడు. నాతో అలా అబద్దాలు చెప్పి ఆమె మా ఫ్లాట్ కు వెళ్లింది అంటే.. ఇంకా ఎంత మందితో ఎఫైర్లు పెట్టుకుందో అంటూ గౌతమి ఆరోపించింది. గౌతమి ఇలా రోజుకొక ఇంటర్వ్యూతో రచ్చ రచ్చ చేస్తోంది.
Read Also : OG : పవన్ కల్యాణ్, సుజీత్ రెమ్యునరేషన్ ఎన్ని కోట్లంటే..?