Site icon NTV Telugu

Gauri Khan: అంతకుమించిన నరకం మరొకటి లేదు.. ఆర్యన్ అరెస్ట్‌పై స్పందన

Gauri Khan Aryan Arrest

Gauri Khan Aryan Arrest

Gauri Khan Reacts On Aryan Khan Arrest In Koffee With Karan Show: గతేడాది డ్రగ్స్ కేసులో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ అరెస్టైన సంగతి తెలిసిందే! దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో.. ఆ తర్వాత అతనికి క్లీన్ చిట్ ఇచ్చింది. దీనిపై చాలా రోజుల తర్వాత స్పందిస్తూ.. ఆ ఘటన వల్ల తానెంతో కుంగిపోయాయని, తప్పు చేయకపోయినా కుటుంబ పరువు బజారున పడిందంటూ ఆవేదన ఆర్యన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత అతని తల్లి గౌరీ ఖాన్ తొలిసారి ఆర్యన్ అరెస్ట్‌పై స్పందించింది. కాఫీ విత్ కరణ్ షోలో పరోక్షంగా ఆర్యన్ అరెస్ట్‌ని ప్రస్తావిస్తూ.. ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నారని కరణ్ జోహర్ సంధించిన ప్రశ్నకు గౌరీ ఖాన్ ఇలా స్పందించారు.

‘‘ఆ సమయంలో మేమంతా ఎంతో బాధపడ్డాం. ముఖ్యంగా.. ఒక తల్లిగా నేను నరకం అనుభవించాను. అయితే, మేము అంతే బలంగా నిలబడ్డాం. అప్పుడు అందరూ ఒక కుటుంబంలా మాకు అండగా నిలబడ్డారు. ఏమాత్రం పరిచయం లేని వ్యక్తులు సైతం మెసేజ్‌లు చేసి, మమ్మల్ని ఓదార్చారు. ధైర్యం నింపారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మాకు అండగా నిలిచిన ప్రతిఒక్కరూ కృతజ్ఞతలు తెలపాలనుకుంటున్నా’’ అని గౌరీ ఖాన్ చెప్పుకొచ్చారు. కాగా.. ముంబైలో ఒక క్రూజ్ షిప్‌లో డ్రగ్స్ లభించడం, అదే నౌకలో ఆర్యన్ ఖాన్ ఉండటంతో, పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. గతేడాది అక్టోబర్ 3న ఆర్యన్‌ని అరెస్ట్ చేసిన ఎన్‌సీబీ అధికారులు.. 28 రోజులపాటు అతడ్ని జైల్లోనే ఉంచారు. అక్టోబర్ 30న బెయిల్‌పై విడుదలయ్యాడు. చివరికి ఆర్యన్‌కి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లభించకపోవడంతో, ఎన్సీబీ అతనికి క్లీన్ చిట్ ఇచ్చింది.

Exit mobile version