నటి, నిర్మాత జీవిత రాజశేఖర్- గరుడ వేగా సినిమా నిర్మాతల వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. సందర్భం వచ్చినప్పుడల్లా ఇద్దరు ఒకరిపై ఒకరు వ్యంగ్యాస్త్రాలు గుప్పిస్తున్నారు.నిన్నటికి నిన్న జీవితా.. ‘శేఖర్’ సినిమా ప్రెస్ మీట్ లో గరుడవేగ సినిమా వివాదం కోర్టులో ఉందని, కోర్టులో తేలకముందే కొందరు ఏదేదో చెబుతున్నారంటూ అసహనం వ్యక్తం చేసింది. నా కూతురు లేచిపోయింది కొందరు, మేము మోసం చేశామని మరికొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. దయచేసి అలాంటివి చేయకండి.. మా కుటుంబ పరువు తీయకండి.. అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ వ్యాఖ్యలపై నేడు గరుడవేగ నిర్మాతలు కోటేశ్వరరాజు, హేమ తీవ్రంగా మండిపడ్డారు.
ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వారు మాట్లాడుతూ ” జీవిత ఒక పెద్ద మహానటి.. ఏదైనా మాట్లాడి తిమ్మిని బమ్మిని చేయగలదు. కొన్ని రోజుల క్రితం ఆమె మమ్మల్ని చంపేస్తామని బెదిరించింది. ప్రజలను అబద్ధాలతో, పెద్ద మనుషుల పేర్లతో మోసం చేస్తున్నారు. మొన్నటివరకు మేము ఎవరో కూడా తెలియదు అన్న ఆమె ఇప్పుడు మా గురించి లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడింది. మాది పరువు గల కుటుంబం.. జీవితా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు.. మీకో జీవితం, సామాన్యులకు ఒక జీవితం ఉంటుందా..? ఎంతమందిని మోసం చేస్తారు. మేము గరుడవేగ సినిమాకు సంబంధించిన డబ్బును ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఆధారాలతో సహా అన్నీ మేము కోర్టులో సమర్పించాము. కోర్టులో మేము విజయం సాధిస్తాం.. జీవిత నోటికొచ్చినట్లు మాట్లాడుతోంది.. ఆమె గురించిన నిజాలు అన్ని కోర్టులో చెప్తాం” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ వ్యాఖ్యలపై జీవితా ఎలా స్పందిస్తుందో చూడాలి.
