Gangs of Godavari: విశ్వక్ తో నేహా లిప్ లాక్.. రాధికా ఇచ్చినట్టు హ్యాండ్ ఇవ్వదు కదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gangs of Godavari: మాస్ కా దాస్ విశ్వక్ సేన్, నేహా శెట్టి జంటగా లిరిసిస్ట్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ అంజలి కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. సుట్టంలా సూసి పోకలా అంటూ సాగే ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. విశ్వక్ – నేహా శెట్టి మధ్య సాగిన రొమాంటిక్ సాంగ్ లా కనిపిస్తుంది. గోదావరి ప్రాంతాలలో చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెల్సిందే.
Miheeka Bajaj: మ్యాగజైన్ కవర్ పై రానా భార్య.. హీరోయిన్లు సైతం దిగదుడుపే
Also Read
ఇక సాంగ్ లో కూడా గోదావరి అందాలను అద్భుతంగా చూపించారు. ఇక సాంగ్ లో నేహా అందాలు.. విశ్వక్ హుక్ స్టెప్స్ ఆకట్టుకున్నాయి. శ్రీ హర్ష ఈమని లిరిక్స్ అందించిన ఈ సాంగ్ ను అనురాగ్ కులకర్ణి తన వాయిస్ తో వేరే లెవెల్ కు తీసుకెళ్లింది. వీడియోను చూస్తుంటే.. నేహా పెద్దింటి అమ్మాయిలా కనిపిస్తుండగా.. విశ్వక్ ఊర మాస్ అవతారంలో దర్శనమిచ్చాడు. వీరిద్దరి ప్రేమ వలనే సినిమా మరో మలుపు తిరుగుతుందేమో అని అనిపిస్తుంది. ఇక ముఖ్యంగా చివరిలో విశ్వక్, నేహా లిప్ లాక్ హైలైట్ గా నిలిచింది. ఇక ఈ ముద్దు చూసిన అభిమానులు మాత్రం.. డీజే టిల్లు ను గుర్తుకు చేసుకుంటున్నారు. అందులో టిల్లుకు ఇలాగే ముద్దు పెట్టి హ్యాండ్ ఇచ్చావ్.. ఇందులో కూడా విశ్వక్ కు హ్యాండ్ ఇవ్వవు కదా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో విశ్వక్ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.
తాజావార్తలు
-
Team India Record: టీ20ల్లో టీమిండియా నయా రికార్డు.. ప్రపంచంలోని మొదటి జట్టు..!
-
CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
-
Ilaiyaraaja : ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?