Site icon NTV Telugu

Game Changer : గేమ్ ఛేంజర్ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే..?

Game Changer Pre-release event

Game Changer Pre-release event

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఎస్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించారు. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ మూవీ జ‌న‌వ‌రి 10న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.

Also Read : Shankar : ఇండియన్ -3 రిలీజ్ పై శంకర్ కీలక కామెంట్స్

రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు మేకర్స్. అందులో భాగంగానే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను USA లో జనవరి 4న గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఇందుకోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అమెరికా చేరుకున్నారు. ఇక ఈ సినిమా తెలుగు రాష్ట్రాల ప్రమోషన్స్ లో కూడా దూకుడు పెంచింది చిత్ర యూనిట్. తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించేందుకు లొకేషన్ వేటలో ఉన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి లేదా వైజాగ్ లో ఈవెంట్ చేసేందుకు ఆలోచన చేస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవరే స్టార్ పవన్ కళ్యాణ్ ను ముఖ్య అతిధిగా రానున్నట్టు టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే గనుక గేమ్ ఛేంజర్ హైప్ ఒక్కసారిగా ఎక్కడికో వెళ్తుంది. అలాగే ఈ సినిమా ట్రైలర్ ను ఈ నెల 27 న ఈవెంట్ నా లేక .ఆన్ లైన్ లో రిలీజ్ చేయాలా అన్నదానిపై డిస్కషన్ జరుగుతోందట.

Exit mobile version