Galla Ashok : పబ్ వివాదంతో సంబంధం లేదు !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజు ఉదయం నుంచి హైదరాబాద్ లోని ఓ పబ్ పై పోలీసులు దాడి జరిపారు. అందులో పలువురు ప్రముఖుల పిల్లలు పట్టుబడ్డారు అనే వార్తలు సంచలనంగా మారాయి. బంజారాహిల్స్‌లోని ఓ ప్రముఖ పబ్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు దాడి చేసి యజమానితో సహా 150 మందిని అరెస్టు చేశారు. వీరిలో సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఉండడంతో ఇది హాట్ టాపిక్‌గా మారింది. పబ్‌లో జరిగిన పార్టీలో వీరంతా డ్రగ్స్ వాడినట్లు తెలుస్తోంది. ఈ పార్టీలో పలువురు ప్రముఖుల పేర్లు బయటకు వస్తున్నాయి. అయితే అందులో టాలీవుడ్ యంగ్ హీరో గల్లా అశోక్ కూడా ఉన్నట్లుగా కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ విషయంపై స్పందించిన గల్లా ఫ్యామిలీ పబ్ వివాదంతో గల్లా అశోక్ కు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది.
Read also : Badshah : పాపులర్ సింగర్ కు యాంగ్జయిటీ డిజార్డర్… !
Also Read
- Fauzi Shooting Update: 'ఫౌజీ' కోసం డార్లింగ్ స్పీడ్ చూసి ఫ్యాన్స్ ఫిదా! ఒకేసారి రెండు యూనిట్స్..
- Spirit: స్పిరిట్ షూటింగ్'కి నెల రోజుల బ్రేక్
- Irumudi : అయ్యప్ప ‘బంగారు పల్లకి’ సాంగ్ రెడీ అవుతోంది..!
- Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
ఈ మేరకు ఓ మీడియా నోట్ ను విడుదల చేసిన గల్లా కుటుంబ సభ్యులు నిన్న రాత్రి హైదరాబాద్ లోని ఓ పబ్ పై పోలీసులు జరిపిన రైడ్ లో గల్లా అశోక్ పేరును కూడా జత చేసి కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేస్తున్నాయి. ఈ వ్యవహారంలో గల్లా అశోక్ కి ఎలాంటి సంబంధం లేదు. దయచేసి ఇలాంటి నిరాధారమైన వార్తలని మీ మీడియాలో ప్రసారం చెయ్యొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం అంటూ ప్రెస్ నోట్ ను విడుదల చేశారు. ఇక ఈ పబ్ వివాదంలో డ్రగ్స్ పట్టుబడడం, నిబంధనలకు విరుద్ధంగా పబ్ నిర్వహణ వంటి విషయాలతో ఈ కేసు మరింతగా ముదురుతోంది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!